Telangana Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పని చేయాలలని.. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ గా జరిగిందన్నారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని.. అప్పుడే బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామన్నారు. . పార్టీ నిర్మాణంపై పీసీసీ ఫోకస్ పెట్టాలి. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్‌లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్ట కాలంలో పని చేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలని సూచిచారు.
మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమ శిక్షణతో వ్యవహరించాలన్నారు. పదువులను వెంటనే భర్తీ చేయాలని.. కార్యకర్తలను నారాజ్ చేయవద్దన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయన్నారు. నేను గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని.. అందరూ రెడీ కావాలని పిలుపునిచ్చారు.
కార్యకర్త స్థాయి నుంచి అనేకమంది ముఖ్యమంత్రులుగా,మంత్రులుగా,పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారు…పార్టీ లో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయని తెలిపారు. నాకు కాంగ్రెస్ పార్టీ భాద్యతల తోనే ముఖ్యమంత్రి పదవి దక్కింది..పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వం లో పదవులు ఇచ్చాం…పార్టీ పదవులు వచ్చాయని పనిచేయక పోతే వారి ని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారు.. కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి…స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని స్పష్టం చేశారు.
మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి తీసుకురావలసిన బాధ్యత మీదే… పార్టీ నిర్మాణం లో మీరు బాధ్యత తీసుకోవాలి… అధికారం వచ్చిన సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం..18 నెలల్లో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాం.,దేశం లో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు. విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు,40 శాతం డైట్ చార్జీలు పెంచామని గుర్తు చేశారు. 100 ఏళ్ల కులగణన కలను నెరవేర్చామని.. కులగణన చేసి మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరామన్నారు. కేంద్రం మెడలు వంచి దేశం లో కులగణన చేపట్టాలని నిర్వహించేలా చేశామని.. ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్ళ నుంచి పోరాటం చేశారు..అనేక మంది త్యాగాలు చేశారు..ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యకు పరిష్కారం చూపించామని గుర్తు చేశారు.
పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చాం.,పార్టీ నిర్మాణం లో క్రియాశీలక పాత్ర పోషించాలనినారు. పార్టీ పదవి అని చిన్న చూపు చూడొద్దు..రేపు గొప్ప అవకాశాలు ఇచ్చేది పార్టీ పదవులేనన్నారు. 2029 లో పార్టీ 2 వ సారి అధికారం లోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ ఎస్ పాలనకు,18 నెలల కాంగ్రెస్ పాలన పైన బహిరంగ చర్చకు సవాల్ చేయాలి…18 నెలల్లో మన ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని సూచించారు.