వివేకా హత్య కేసులో కీలక పరిణామం జరిగింది . కేసులో కీలక సాక్షి, వాచ్ మెన్ రంగన్న మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన...వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక, ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయి. వివేకా కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలున్నాయి.క టికరెడ్డి శ్రీనివాస రెడ్డి, కల్లూరి గంగాధర రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ Y.S అభిషేక్ రెడ్డి ఇప్పుడు రంగన్న... చనిపోయారు. 


రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. వాచ్ మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ, కేసును దర్యాప్తు చేయడానికి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం)  ఏర్పాటు చేశాం. అత్యంత అనుమానాస్పద మృతిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు.


సైంటిఫిక్ యాంగిల్ లో కూడా కేసు దర్యాప్తు చేసి నిజాలు వేలికితీస్తం అన్నారు. వివేకా హత్య కేసులో ఉన్న ముద్దాయిల ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతాం అని కడప ఎస్పీ  అశోక్ కుమార్ అన్నారు.