Amrutham Serial: ఇలాంటి గృహ ప్రవేశం ఎక్కడైనా చూశారా? - మీ కోసమే 'అమృతం' సీరియల్ ఎపిసోడ్.. చూసి ఎంజాయ్ చెయ్యండి
Amrutham Serial Review: 'అమృతం' సీరియల్.. ఈ పేరు వింటేనే పెదవులపై చిరునవ్వు కన్ఫమ్‌గా వచ్చేస్తుంది. 90sలో వచ్చిన ఈ సీరియల్ పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఓ ప్రత్యేకమే. ఆ హాస్య రసామృతం మళ్లీ మీ కోసం.

Amrutham Serial First Episode Review: 'ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు..' ఈ పాట వింటుంటే ఇప్పుడు జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90s కిడ్స్‌కు మాత్రం బాగా గుర్తుంటుంది. ప్రతీ ఆదివారం రాత్రి 8:30 అయితే చాలు టీవీలకు అతుక్కుపోయేవారు. అదేనండీ మన అమృతం సీరియల్ కోసం. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ సీరియల్ అంటేనే ఓ స్వీట్ మెమొరీ. టైం అయితే కుటుంబమంతా జెమినీ టీవీ పెట్టుకుని నవ్వుల కోసం ఎదురుచూస్తుండేవాళ్లు. తొలుత కేవలం ఓ 50 ఎపిసోడ్స్ అనే అనుకున్నా.. ఆ తర్వాత ఈ సీరియల్‌కు వచ్చిన ఆదరణ చూసి దాదాపు 313 ఎపిసోడ్లతో సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యింది. గుణ్ణం గంగరాజు సృష్టించిన ఈ హాస్య రసామృతం దాదాపు ఆరేళ్లు పాటు విజయవంతంగా సాగింది. సీరియల్‌లో శివాజీరాజా, నరేశ్, హర్షవర్ధన్ గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, నరేశ్, రాగిణి, ఝూన్సీ కీలక పాత్రలు పోషించారు.
అంజి, అప్పాజీ, సర్వం రోల్స్‌లో ఆరేళ్లు ఒక్కరే..
ఆరేళ్ల పాటు సాగిన సీరియల్‌లో 'అమృతం' రోల్‌లో తొలుత శివాజీ రాజా, ఆ తర్వాత నరేశ్, ఆయన తర్వాత హర్షవర్ధన్ నటించి మెప్పించారు. ఇక అమృతం స్నేహితుడు 'అంజి'గా గుండు హనుమంతరావు రోల్ బుల్లితెర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఓ చెరగని ముద్ర వేసింది. ఆయన భార్య శాంతగా రాగిణి, సార్వాడు.. సార్వాడు అంటూ నవ్వులు పంచే 'సర్వం' రోల్‌లో వాసు ఇంటూరి, పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి టెనెంట్స్‌ను పీల్చి పిప్పి చేస్తూ నవ్వులు పూయించే 'అప్పాజీ' రోల్‌లో నారిపెద్ది శివన్నారాయణ నటన ఎప్పటికీ ఓ అద్భుతమే. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సాగే సీరియల్‌ను.. ఇప్పటికీ ఒత్తిడికి గురైతే కాసేపు నవ్వుకుందామని చూసే వారు లేకపోలేదు. సింపుల్‌గా చెప్పాలంటే 'అమృతం' ఓ స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. అలాంటి అమృతం సీరియల్‌ను మీకు గుర్తు చేస్తూ ఆనాటి హాస్య అమృతానందాన్ని మీకు పరిచయం చేస్తూ.. మరోసారి ఆ నవ్వుల ఎపిసోడ్స్ మీ కోసం..
'ఇది చాలా వెరైటీ గృహ ప్రవేశం కదూ..'
ఇక ఫస్ట్ ఎపిసోడ్ విషయానికొస్తే.. 'గో గృహప్రవేశం'.. ఈ ఎపిసోడ్‌లో ఆంజనేయులు పక్క ఇంట్లోకి అమృతం రావాలని చూస్తాడు. ఆ రోజే గృహ ప్రవేశం. అయితే, ఇంట్లో దిగే ముందు గోవుతో ప్రవేశం చేయాలని అంజి, అమృతం భావిస్తారు. ఓ గోవును తీసుకొచ్చి ఇల్లంతా కలియదిప్పుతారు. ఎంత ప్రయత్నించినా చివరకు అది పేడ మాత్రం వేయదు. దీంతో ఆవుకు 'గజ విరోచ్' అనే ఏనుగుల కోసం వాడే ఆముదం పట్టిస్తారు. ఈ లోపు ఇంటి విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టే అప్పాజీ ఆ ఇంటికి వస్తాడు. 'ఇంట్లో దిగి ఇంతసేపైనా నాకు ప్రసాదం పంపించరా..?' అంటూ అంజి, అమృతంపై మండిపడతాడు. అతనలా ఇంట్లో ఎంటర్ కాగానే గాయపడతాడు. ఇంతకూ వారి కల నెరవేరిందా..? ఇంట్లో ఆవు పేడ వేసిందా.?.. వారి గృహ ప్రవేశం ఎలా జరిగిందో తెలియాలంటే.. ఈ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేసేయండి మరి...
Also Read: సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసినా నో క్రేజ్ - ఇప్పుడు గూగుల్ ఇండియాలో టాప్ పొజిషన్‌లో..