కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి(Mla Mallikarjuna Reddy) ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం రాత్రి వాహనంతో ఎమ్మెల్యే(Mla) ఇంటి మెయిన్ గేట్ ఢీకొట్టి, టైర్లు, కట్టెలు గేటు ముందు వేసి తగలబెట్టడానికి యత్నించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇంటిలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దుండగలు దుశ్చర్యతో వాచ్ మెన్ కుటుంబం భయాందోళనకు గురైంది. వాచ్ మెన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు(Police) సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దుండగలు అక్కడి నుంచి పరారయ్యారు.  ఈ ఘటన గురించి తెలుసుకున్న వైసీపీ నాయకులు(Ysrcp Leaders), కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా(Annamayya District) కేంద్రంగా రాజంపేట(Rajampeta)ను ప్రకటించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మేడా ఇంటిపై దాడి సంచలనం సృష్టిస్తుంది. 



రాజంపేట వర్సెస్ రాయచోటి


కొత్త జిల్లాల అంశం కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)లో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే, రాయచోటి ఎమ్మెల్యే(Rayachoti Mla)  మధ్య విభేదాలకు కారణం అవుతోంది. రెండు చోట్ల వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలు తమ ప్రాంతానికి మ్దదతుగా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివాదానికంతటికి కారణం కడప జిల్లాను విభజించి కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రం(Districti Headquarter)గా రాయచోటిని నిర్ణయించారు. ఇది రాజంపేట వాసుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అన్నమ్మయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వినతి పత్రం అందించారు. ఈ మధ్య జరిగిన పరిణామాలు చాలా బాధించాయని మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు.  గతంలో సీఎం జగన్(CM Jagan) రాజంపేటను జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  వైసీపీ విధానం ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రం చేయాలి. రాజంపేట పార్లమెంట్ కేంద్రం అయినప్పటికీ రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ అన్నమయ్య జిల్లాగా రాయచోటిని చేయడం బాధాకరమని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


ఇప్పటికే ఈ విషయాన్ని  సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లామని ఎమ్మెల్యే మేడా గతంలో తెలిపారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి(Parliament Constituency) కు ఒక ప్రత్యేకత ఉందన్నారు.  ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి వెనుక  పరిణామాలు ఏమి జరిగాయి అన్నది తెలియదన్నారు. రాజంపేటకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అన్నమయ్య(Annamayya) జన్మస్థలం రాజంపేట అని.. బ్రిటిష్ కాలం నాటి నుంచి రాజంపేటకు ప్రత్యేకత ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాయచోటి జిల్లాగా చేస్తూ తాళ్ళపాక అన్నమయ్య పేరును పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.