CBI Case Avinash Reddy :  కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తూ ఆయనకు 41ఏ నోటీసులను సీబీఐ జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం మధ్యాహ్నం మూాడు గంటల సమయంలో ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట న్యాయాదులు ఉన్నారు.  సీబీఐ కార్యాలయం వద్ద ఉదయం నుంచి పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు. వారందర్నీ పోలీసులు అక్కడ్నుంచిపంపించారు.  దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. వివేకా కేసులో మొదటి సారిగా అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది. 


ముందుగా లోటస్ పాండ్‌లో వైఎస్ విజయలక్ష్మితో అవినాష్ రెడ్డి భేటీ 


అవినాష్ రెడ్డి  సీబీఐ కార్యాలయానికి  వచ్చే ముందు లోటస్ పాండ్‌లోని వైఎస్ విజయలక్ష్మి నివాసానికి వెళ్లారు. దాదాపుగా అరగంట పాటు చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చి నేరుగా  సీబీఐ ఆఫీసుకు వెళ్లారు. ఏ అంశాలపై చర్చించారన్నది స్పష్టత లేదు. అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అవినాష్ రెడ్డికి ఈ నెల 24నే విచారణకు రావాలని 23న సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు.  


విచారణకు లాయర్ ను అనుమతించాలని .. వీడియో రికార్డింగ్ కు అనుమతి ఇవ్వాలని సీబీఐకి లేఖ 


ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి ఉదయం ఓ లేఖ రాశారు.  ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై సీబీఐ అధికారుల స్పందన ఏమిటో స్పష్టత లేదు. 


తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపణ


ఈ కేసుపై గతంలో స్పందించిన అవినాష్ రెడ్డి ..తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ారోపించారు.  నిజం తేలాలని తాను కూడా భగవంతుడుని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆరోపణలు చేసేవారు.. ఇలాంటి ఆరోపణ చేస్తే వాళ్ల కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాలన్నారు ఎంపీ. తన గురించి జిల్లా ప్రజలకు తెలుసని.. సీబీఐ విచారణకు వెళ్లి వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు.


ఎప్పుడైనా ఎన్నికలు, సిద్ధంగా ఉండాలి- నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్‌ కీలక ప్రకటన