ఆంధ్రప్రదేశ్  హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు  పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు  మిశ్రా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.  


Also Read : విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్...


ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత సీఎం జగన్ సహా పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలుతెలిపారు.  జస్టిస్ మిశ్రా చత్తీస్‌ఘడ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్​లోని రాయగఢ్​లో జన్మించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయవాద విద్య అభ్యసించి లాయర్‌గాప్రాక్టీస్ చేశారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 


Also Read : ఏపీలోనే విద్యుత్ కష్టాలు..! తెలంగాణలో "పవర్" ఫుల్లేనా ?


2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఇప్పుడు పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు.  ఏపీ హైకోర్టును ఏర్పాటు చేసిన తర్వాత జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా మూడో ప్రధాన న్యాయమూర్తి. తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి వచ్చారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పటి వరకూ సీజేగా ఉన్న జస్టిస్ అరూప్ గోస్వామి చత్తీస్‌ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. 


Also Read : మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేయాలి... ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పలు కీలకమైన కేసులు పెడింగ్‌లో ఉన్నాయి. అమరావతి వివాదానికి సంబంధించి కేసులు జస్టిస్ జేకే మహేశ్వరి ఉన్నప్పుడు విచారణ జరిగాయి. ఆయన బదిలీ కావడంతో విచారణఆగిపోయింది. కొత్త సీజే నేతృత్వంలో కూడా విచారణ ప్రారంభం కాలేదు. ఇప్పుడు మరో సీజే వచ్చారు. ఆయన నేతృత్వంలో అమరావతి కేసుల విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  


Also Read: ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు... కేఆర్ఎంబీ కీలక ప్రకటన... బోర్డు పరిధిలోకి జల విద్యుత్ పై తెలంగాణ అభ్యంతరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి