Janasena on CM Jagan: జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందని జనసేన రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ 12,13,14 వ తేదీల్లో పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చారని వివరించారు. జగనన్న కాలనీల్లో అనేక అరాచకాలు జరిగాయని.. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం అని తెలిపారు. లబ్ధిదారుల కేటాయింపు పారదర్శకంగా జరగ లేదని పేర్కొన్నారు. సోషల్ ఆడిట్‌లో క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశీలిస్తున్నామన్నారు. సీఎం జగన్.. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం అయ్యిందని అవాస్తవాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న మోసం అనే హ్యాస్ టాగ్ పెట్టామని.. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై జనసేన పోరాటం చేస్తుందని తెలిపారు.






సజ్జల అబద్దాలు మానేసి సత్యాలు మాట్లాడాలని కోన తాతారావు తెలిపారు. గొప్పలు చెబుతున్నారు తప్ప చేసిందేమీ లేదన్నారు. జూన్ 22 నాటికి అసెంబ్లీ సాక్షిగా అందరికి ఇళ్ళు ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని.. ఇస్తే ఎక్కడ ఇచ్చారో చెప్పాలని పేర్కొన్నారు. సబ్బవరం దగ్గర ఇచ్చామని చెప్పారు.. అక్కడ లెవెల్ చేయడానికే మీరు కోట్లు ఖర్చు చేశారని కోన తాతారావు విమర్శించారు. ప్రజల పక్షాన జనసేన ముందు ఉంటుందన్నారు. 3 రోజుల పాటు ప్రజల అందరికి వాస్తవ పరిస్థితులను తెలియజేస్తాన్నారు. ఇళ్ల కూల్చివేత పై వైసీపీ నేతలే డ్రామా ఆడారని ఆరోపించారు. 






పవన్ కల్యాణ్ ఏ సమయానికి వస్తారో మాకు పూర్తి సమాచారం తెలియదని బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. కానీ అధికారికంగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామన్నారు.