Pawan Kalyan : పంటలు నష్టపోయిన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు జనసేన పార్టీ ముందుకొచ్చింది. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ యాత్ర కోసం 12వ తేదీ ఉదయం 9 గంటలకు పవన్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు పవన్ కల్యాణ్. ఉదయం గం.10.30 నిమిషాలకు కొత్త చెరువు నుంచి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తారు. గం.11:20 నిమిషాలకు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. 






బాధిత కుటుంబాలకు భరోసా


గొట్టూరులో మరో రైతు కుటుంబాన్ని పవన్ పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్థిక సాయం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం గం. 12.10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో సుమారుగా 20 రోజుల క్రిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్ధిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరి కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్థిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. గ్రామసభ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు.






Also Read : Nagababu On Ysrcp : మంత్రి పదవులు దక్కని వారికి నాగబాబు ఓదార్పు - మంత్రులకు నా మనవి అంటూ సెటైర్లు