Jana Sena chief Pawan Kalyan met PM Modi with his family : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రదాని మోదీతో సమావేశం అయ్యారు. ఆయన వెంట సతీమణి అన్నా లెజ్ నోవా, కుమారుడు అకీరానందన్ ఉన్నారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. మరోసారి శుక్రవారం ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ సమయం ఇవ్వడంతో ఆయనతో మరోసారి సమావేశం అయ్యారు. కుటుంబాన్ని పరిచయం చేశారు. తన కుమారుడు అకీరాను కూా ప్రధానితో భేటీకి తీసుకెళ్లారు. అకీరా ఇటీవల పవన్ కల్యాణ్‌తో ఎక్కువగా కనిపిస్తున్నారు. చంద్రబాబునాయుడుతో సమావశంలోనూ అకీరా కనిపించారు.
సమావేశంలో కుమారుడ్ని ప్రధానికి పరిచయం చేశారు పవన్ కల్యాణ్.
ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు ఎంపీ సీట్లు ఉన్న జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బుధవారం జరిగిన ఎన్డీఏ మీటింగ్‌లో కూడా పవన్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతిస్తూ సంతకాలు కూడా చేశారు. మరోసారి శుక్రవారం ఎన్డీఏ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి వర్గంలో జనసేన పార్టీకి కూడా చోటు దక్కుతుందని భావిస్తున్నారు.
ఎన్నికల్లోఅద్భుత విజయం సాధించిన జనసేన
ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అరుదైన ఘనత సాధించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుందని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు. అయితే అదే సమయంలో జనసేన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతోందని, ఈ రెండింటి మధ్య టెక్నికల్‌గా ఎలా సాధ్యమో చూడాలని అంటున్నారు. అంటే ప్రతిపక్ష పాత్ర కూడా జనసేన పాటించాలనుకుంటోంది.
కేవలం రూపాయి జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు కాకుండా ఓ ప్రజా ప్రతినిధిగా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటా. దీనివల్ల తాము చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున పనులు ఎందుకు చేయవనే అధికారం ప్రజలకు ఉంటుంది. అందుకే సంపూర్ణంగా జీతం తీసుకొని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతానని స్పష్టం చేస్తున్నారు. యువతకు ప్రజాప్రతినిధులు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా జనసేన ప్రయాణం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. వ్యక్తిగత దూషణలు లేకుండా కొత్త ఒరవడిని తెద్దాం. కొత్తగా నిరి్మస్తున్న జనసేన కార్యాలయం తలుపులు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు నిరంతరం తెరిచే ఉంటాయని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు.