AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు జగన్ పై ఉన్న కేసుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నేర స్వభావం గురించి కూడా వ్యాఖ్యానించారు. ఎజెండా పై చర్చ పూర్తి అయిన తర్వాత మంత్రులతో  చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ నేరస్వభావంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

గతంలో నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారన్నారు.  ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  నేరం చేసి మళ్లీ మన మీద నిందలు వేస్తున్నారన్నారు. జగన్ తప్పు చేశాడు ఎందుకు చర్యలు తీసుకోకూడదన్న మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే  నన్ను జైలులో పెట్టాడని జగన్‌ను జైలులో పెడితే ఎలా కుదురుతుంది.. అది కరెక్ట్ కాదు కదా? అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుాగ తెలు్సోతంది.  జగన్ తప్పులకు  సాక్ష్యాలు  ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఇంకా కష్టపడాలి. ఈ ఏడాది బాగా చేశారని ప్రశ్నించారు.  ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం సాయం చేస్తుందని చంద్రబాబు తెలిపారు. 

అంతకు ముందు  ఏపీ కేబినెట్ సమావేశం 9 అంశాలు అజెండాగా  జరిగింది.  అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు  కేబిననెట్ ఆమోదంతెలిపింది.  హెచ్‍వోడీ 4 టవర్ల టెండర్లకూ ఆమోదం లభించింది.  అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.  అమరావతి రెండో దశలో భూమి సేకరణ అంశంపైనా చర్చించారు.  2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు.  

శ్రీకాకుళంలో మంచినీటి సరఫరాకు రూ.5.75 కోట్లు. కుప్పంలో వయోబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం రూ.8.22 కోట్లు విడుదలకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది.  17 మంది ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకుంది.  248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పనకు ఆమోద ముద్ర వేసింది.  YSR కడప జిల్లాగా పేరు మారుస్తూ జీవో, పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనపై నిర్ణయం తీసుకుంది.   పరిశ్రమలకు సంబంధించిన 2025 చట్టంలో సవరణలకు ఆమోదం కేబినెట్ ఇచ్చింది.   "తల్లికి వందనం" పథకాని నిధుల విడుదల,   జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు,   కూటమి సర్కార్‌ ఏడాది పాలనకు సంబంధించి సమీక్షా నివేదికపైనా చర్చించారు. 

అంతకు ముందుకు ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రులు అందరూ  అభినందించారు.