MG Windsor EV Maintenance Cost: భారతీయ మార్కెట్లో అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ కార్‌ల గురించి చర్చ వచ్చినప్పుడు MG విండ్‌సోర్‌ EV గురించి కూడా తప్పక చెప్పుకోవాలి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న EVల్లో ఇది ఒకటి. బడ్జెట్‌ రేటులోనే ప్రీమియం ఫీచర్లను ఈ ఎలక్ట్రిక్‌ కారు ఇస్తోంది.

MG విండ్‌సోర్‌ EV ప్రత్యేకత ఏంటంటే.. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే ఈ EV 5 సంవత్సరాలలో మీకు పూర్తిగా 10 లక్షలు ఆదా చేయగలదు. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందా అనే సందేహం వద్దు, ఇప్పుడు చెప్పబోయే గణాంకాలతో మీరూ దీనిని ఒప్పుకుంటారుప.

MG విండ్‌సోర్‌ EVని EMI ఆప్షన్‌లో కొనవచ్చా?బ్యాటరీ రెంటల్‌ ప్లాన్‌లో (BaaS) MG Windsor EV ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధర రూ. 9 లక్షల 99 వేలు కాగా (దాదాపు రూ.10 లక్షలు), ఈ సెగ్మెంట్‌లో దీనితో పోటీపడే కార్ల ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ. 15 లక్షల నుం ప్రారంభం అవువుంది. Windsor EV కోసం రిజిస్ట్రేషన్/TCS/బీమా ఛార్జీలు రూ. 75,000 వరకు అవుతాయి. ఈ EVని కొనడానికి బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ మీకు లోన్‌ ఇస్తుంది. మీరు ఈ కారును రూ. 1.80 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే రూ. 8.94 లక్షల రుణం తీసుకోవాలి. వార్షిక వడ్డీ రేటు 9 శాతం అనుకుంటే, రుణం తిరిగి చెల్లించడానికి 36 నెలల కాల గడువు పెట్టుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 28,429 EMI చెల్లించాలి. 

ఇప్పుడు, కాంపాక్ట్ సైజ్‌ SUV విషయానికి వద్దాం. ఈ బండి రిజిస్ట్రేషన్/TCS/బీమా ఛార్జీలు రూ. 1.60 లక్షలు. రూ. 1.80 లక్షల డౌన్ పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తే మీరు రూ. 9.78 లక్షల కార్ లోన్ తీసుకోవాలి. ఒకవేళ మిడ్-సైజ్ SUV తీసుకుని అదే డౌన్‌ పేమెంట్‌ చేస్తే, ఈ కార్ లోన్ రూ. 14.58 లక్షలు అవుతుంది. 9 శాతం వార్షిక వడ్డీ రేటు, 36 నెలల టెన్యూర్‌లో - కాంపాక్ట్ సైజ్‌ SUV కోసం నెలకు రూ. 31,127 EMIని బ్యంక్‌లో జమ చేయాలి, మిడ్ సైజ్‌ SUV కోసం రూ. 46,364 EMI చెల్లించాలి.

కిలోమీటరుకు ఎంత ఖర్చవుతుంది? MG విండ్‌సోర్‌ EV కిలోమీటరు ఖర్చును కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV తో పోల్చి చూస్తే ఆశ్చర్యపోయే గణాంకాలు కనిపిస్తాయి. MG విండ్‌సోర్‌ EV విషయంలో బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ. 3.50 & ఛార్జింగ్ ఖర్చు 1 రూపాయి అవుతుంది. కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV విషయంలో కిలోమీటరు ఖర్చు 8 రూపాయలు అవుతుంది.

మీరు, కారు ప్రతి నెలా సగటను 1500 కి.మీ. నడిపితే, విండ్‌సోర్‌ EV కోసం అయ్యే ఖర్చు నెలకు రూ. 6,750 అవుతుంది. కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV విషయంలో ఇదే వ్యయం రూ. 12,000 అవుతుంది.

5 సంవత్సరాలలో రూ.10 లక్షలు ఎలా ఆదా అవుతాయి? EMI & కిలోమీటరు ఖర్చు కలిపిన తర్వాత, MG విండ్‌సోర్‌ EV కోసం నెలకు రూ. 35,179 చెల్లించాలి. కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV కోసం వరుసగా రూ. 43,127 & రూ. 58,364 చెల్లించాలి. కాంపాక్ట్ సైజ్‌ SUVతో పోలిస్తే, MG విండ్‌సోర్‌ SUVని కొనుగోలు చేయడం వల్ల 5 సంవత్సరాలలో రూ. 4.20 లక్షలు ఆదా అవుతుంది. మరోవైపు, మిడ్ సైజ్‌ SUVతో పోలిస్తే రూ. 10.17 లక్షలు ఆదా చేస్తారు. మొదట చెప్పుకున్నట్లు, MG Windsor EV ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధర దాదాపు రూ. 10 లక్షలు. అంటే, విండ్‌సోర్‌ EV కొనడం ఐదేళ్లలో మీ పెట్టుబడి  మొత్తం తిరిగి వచ్చినట్లవుతుంది. ఈ లెక్కన, ఐదేళ్ల తర్వాత ఈ ఎలక్ట్రిక్‌ కారు మీకు పూర్తిగా ఉచితంగా మిగిలినట్లే లెక్క.