భారత్, ఇండోనేషియా సంయుక్తంగా సముద్ర శక్తి పేరిట నౌకాదళ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాలకు ఇండోనేషియా సుందా జలసంధి వేదికైంది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత యుద్ధ నౌకలు శివాలిక్, కాడ్‌మట్ 18వ తేదీన జకార్తా చేరుకున్నాయి. సెప్టెంబర్ 20, 21న 3వ ఎడిషన్ 'సముద్ర శక్తి' విన్యాసాలు జరుగుతున్నాయి. సుందా జలసంధిలో 20, 21న ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రెండు దేశాల నావికా దళాలు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర కార్యకలాపాలలో పరస్పర అవగాహన, పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడానికి సముద్ర శక్తి నౌక విన్యాసాలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 




ఈ విన్యాసాల్లో పాల్గొంటున్న భారతీయ నావికాదళ నౌకలు శివాలిక్, కాడ్‌మాట్ లు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవి. వీటిని మల్టీ రోల్ గైడెడ్ స్టీల్త్ ఫ్రిగేట్ మిసైల్, యాంటీ సబ్‌మెరైన్ సాంకేతికతో నిర్మించారు. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకదళంలో ఇవి భాగంగా ఉన్నాయి. భారత నౌకాదళం యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యం ఉన్న లాంగ్ రేంజ్ మారిటైమ్ రికనైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ P8I కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటుంది. ఇండోనేషియా నేవీకి చెందిన KRI బంగ్ టోమో, KRI మలహయతి, సముద్ర పెట్రోలింగ్, నిఘా విమానం CN-235 విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. 




భారతదేశం యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా 2018 నుంచి 'సముద్ర శక్తి' అనే ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. గత రెండు ఎడిషన్‌లలో ఈ విన్యాసాలు మిలిటరీ ఇంటర్‌డిక్షన్ ఆపరేషన్స్ (MIO), క్రాస్ డెక్ ల్యాండింగ్‌లు, ఎయిర్ డిఫెన్స్ సీరియల్స్, ప్రాక్టీస్ వెపన్ ఫైరింగ్స్, రీప్లినిష్మెంట్ అప్రోచ్‌లు, టాక్టికల్ వంటి క్లిష్టమైన సముద్ర కార్యకలాపాల నిర్వహణపై విన్యాసాలు నిర్వహించారు. 




ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారం, మూడో ఎడిషన్ విన్యాసాలను కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారు. రెండు నావికాదళాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి, ఇండో పసిఫిక్ అంతటా బలమైన స్నేహ బంధాన్ని ఏర్పరచుకోవడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఇరు నౌకదళ అధికారులు వెల్లడించారు. 


Also Read: Tdp News: ఏకపక్షంగా పరిషత్ ఎన్నికలు... అందుకే బహిష్కరించామన్న చంద్రబాబు.... పోలీసులపై లోకేశ్ ఫైర్


Also Read: పంది పిల్లను ప్రేమతో పెంచాడు.. 100వ రోజు కోసుకుని తినేశాడు? నిజం తెలిస్తే మెచ్చుకుంటారు!