పెగాసస్ స్పైవేర్ అంశంపై సభా కమిటీతో విచారణ జరిపించాలని అసెంబ్లీ నిర్ణయించడంతో  ఆ మేరకు చివరి రోజున సభా కమిటీని స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన  కరుణాకర్ రెడ్డి ఈ సభా సంఘానికి చైర్మన్‌గా ఉంటారు సభ్యులుగా  కొత్త ప‌ల్లి భాగ్య‌ల‌క్ష్మి,  గుడివాడ అమ‌ర్నాధ్ , మేరుగ నాగార్జున , మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు , కొలుసు పార్ధ‌సార‌ధి,  అబ్బ‌య్య చౌద‌రిలను ఖరారు చేశారు. మమతా బెనర్జీ చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నారని చేసిన వ్యాఖ్యల మేరకు .. సభ్యులు విచారణకు డిమాండ్  చేయడంతో హౌస్ కమిటీని నియమించారు. 


ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బజ్దెట్ సమావేశాలు మొత్తం పన్నెండు రోజుల పాటు జరిగాయి. 61. 45 గంటల సమయం చర్చించారు.  మొత్తం పదకొండు బిల్లులను ామోదించారు. నూట మూడు మంది సభ్యులు సభలో మాట్లాడారు. ఐదు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. నిరవధిక వాయిదా పడే ముందు ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2022-23ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. చర్చకు సీఎం జగన్ సమాధానం ఇచ్చారు.  సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించామని సీఎం జగన్ వెల్లడించారు.  మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చామని తెలిపారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా వెనక్కి తగ్గలేదన్నారు, 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రజలకు అందే పథకాలపై సీఎం జగన్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు,  మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా,  జూన్‌లో అమ్మ ఒడి పథకం, జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు. ,  ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం, సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత, అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా , నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు,  డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు, జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు
, ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు,  మార్చిలో వసతి దీవెన అమలు చేస్తామన్నారు.


ఈ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ఎవరూ మాట్లడలేదు. ప్రతిపక్ష సభ్యులెవరికీ మాట్లాడే చాన్స్ లభించలేదు. సభ ప్రారంభమైన తర్వతా వాయిదా తీర్మానాలపై చర్చకు అంగిీకరించకపోవడంతో వివిధ పద్దతుల్లో నిరసనలు తెలిపారు.  ఈ కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు.