AP Panchayat Election Results : ఏపీలో పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వచ్చాయి. పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు పోటీ పడ్డారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తర్వాత చనిపోయిన వారి స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఏపీలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. బాపట్ల జిల్లా పర్చూరు పావులూరు గ్రామ సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు విజయం సాధించారు. పాడేరు నియోజకవర్గం సీలేరు, హిందూపురం నియోజకవర్గం చలివెందుల గ్రామ పంచాయతీ సర్పంచ్‌లుగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.
గుంటూరు జిల్లా బుర్రిపాలెం సర్పంచ్‌గా పరుచూరి విజయలక్ష్మి (తెదేపా) 1526 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు 1,787 ఓట్లు రాగా.. వైకాపా మద్దతుదారు శాఖమూరి రవీంద్రబాబుకు 261 ఓట్లు వచ్చాయి. నెల్లూరులోని మనుబోలు మండలం,బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం సాధించింది. ఏలూరులోని దెందులూరు మండలం,కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు మండలం ఎర్రమాడు ఉప ఎన్నికలో ఏడో వార్డు అభ్యర్థిగా వైసిపి బలపరిచిన చలివేంద్ర హరిబాబు విజయం సాధించారు
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని గండిగుంట గ్రామంలో పదో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో తెదేపా బలపరిచిన వీరంకి పాండురంగారావు 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెల్లూరుజిల్లాలోరాపూరు మండలం పులిగిలపాడులో వార్డు ఎన్నికలో టిడిపి బలపరిచిన నిమ్మల రాజమ్మ వైసిపి మద్దతుదారుపై 23 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జలదంకి మండలం వేములపాడు 7వ వార్డును టిడిపి బలపరిచిన పొట్లూరి ఆదిలక్ష్మి 34 ఓట్ల మెజార్టీతో సొంతం చేసుకున్నారు. కొండాపురం మండలం సాయిపేట 3వ వార్డులోటిడిపి మద్దతుదారు సానంంగుల రవి 65 ఓట్ల తేడాతో గెలుపొందారు. చేజర్ల మండలం పాతపాడు ఐదో వార్డు ఎన్నికలో టిడిపి, వైసిపి మద్దతుదారులిద్దరికీ.. సమానంగా 32 ఓట్లు వచ్చాయి. అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం లింగరాజుపాలె 5వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో టిడిపి మద్దతుదారు కుప్పలా నాగనూక గౌరి 11 ఓట్ల తేడాతో గెలుపొందారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్ పేట 7వ వార్డులో టిడిపి మద్దతుదారువల్లూరు శివానందం విజయం సాధించారు. అనంతపురంలోగార్లదిన్నె మండలం బూదేడు గ్రామపంచాయతీ 9 వార్డు ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థి సుంకమ్మ 21 ఓట్లతో విజయం సాధించారు. యల్లనూరు మండలం జంగం పల్లి గ్రామ సర్పంచి ఉప ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థి కుళ్ళాయప్ప నాయుడు 18 ఓట్లతో విజయం సాధించారు. బాపట్లలో కొల్లూరు మండలం చిలుమూరు 4వ వార్డులో టిడిపి విజయం టీడీపీ విజయం సాధించింది. ప్రకాశంలో టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామం ఉప ఎన్నికలో టిడిపి బలపరిచిన అభ్యర్థి పిడికిటి శ్రీనాథ్ 68 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో జరుగుతున్న ఒకటో వార్డు ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బాదర్ సింగ్ గారి బాలాజీ సింగ్ వైసీపీ అభ్యర్థిపై 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ మూలగుంటపాడు 10వ వార్డు సభ్యునిగా టిడిపి బలపరచిన అభ్యర్థి అంబటి శ్రీనివాసులు 63 ఓట్లు మెజారిటీ గెలుపొందారు.
చెన్నపనాయునీ పల్లి గ్రామంలో జరిగిన వార్డు సభ్యుని ఉప ఎన్నికల్లో టిడిపి బలపర్చిన అభ్యర్థి యనమల వెంకట నాగరాజు 4 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.