Hydra Commissioner Ranganath meets AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. దాదాపుగా రెండు గంటల పాటు వీరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్ోతంది. శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మంగళగిరి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయానికి హైడ్రా కమిషనర్ వచ్చారు. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. గతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టినప్పుడు ఏపీలోనూ అలాంటి వ్యవస్థ ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో వీరి మీటింగ్ జరగడం ఆసక్తికరంగా మారింది.