JC Prabhakar Reddy : బీఎస్-3 వాహనాలను బీఎస్-4 పేరిట విక్రయించిన కేసులో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఈడీ ముందు హాజరయ్యారు. ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఈడీ విచారణకు వచ్చారు.  వాహనాల కొనుగోలు కుంభకోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. 126 బస్సులను స్క్రాప్ కింద అశోక్ లైలాండ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కొనుగోలు చేశారు. నాగలాండ్ లో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ఏపీలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారని సమాచారం. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. భారీగా నగదు బదిలీ, మనిలాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తుంది. జేసీ కంపెనీ BS-3 వాహనాలను BS-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ, తాజాగా విచారణకు హాజరవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇవాళ వారిద్దరూ విచారణకు హాజరయ్యారు.  


అసలేం జరిగింది? 


బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి ఫేక్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. గడువు తీరి విక్రయం కాకుండా ఉండిపోయిన 154 లారీలను నాగాలాండ్ లో స్క్రాప్ కింద జేసీ కంపెనీ కోనుగోలు చేసింది. 2018లో  నాగాలాండ్ లో 154 లారీలను  రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని విక్రయించగా, మరికొన్నింటిని  జేసీ కంపెనీ సొంతంగా నిర్వహిస్తుంది. ఈ వాహనాల కొనుగోలు చేసిన వ్యక్తులు నకిలీ పత్రాలతో వాహనాలను కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదైంది.  ఈ కేసు విషయంలో ఇటీవల ఈడీ అధికారులు జేసీ ఇంటిలో సోదాలు నిర్వహించారు.  ఈడీ నోటీసులతో ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారణకు హాజరయ్యారు. ఐదు గంటల పాటు ఈడీ  అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డిని విచారించారు.


రాజకీయ కక్షతో తప్పుడు కేసు 


తనపై  ఉద్దేశ పూర్వకంగానే  కేసు నమోదు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయిస్తామని జేసీ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదుచేశారని జేసీ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.  ఈ కేసు దొంగ కేసు అనే విషయం ఈడీ అధికారులకు ఏం తెలుసని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలు అన్నారు. అలాంటి తాను ఎందుకు భయపడాలని జేసీ తెలిపారు. ఈడీ అధికారులు పిలిస్తే విచారణకు వచ్చామన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసు అని జేసీ ప్రభాకర్ రెడ్డి  మీడియాతో అన్నారు.  


Also Read : Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని


Also Read : Tadipatri News :తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు, ఉద్రిక్తతల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు భూమి పూజ