Ap news: వావివరుసలు లేకుండా కొందరు నీచులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తల్లి, కూతురు, అక్క, చెల్లి అనే తేడా లేకుండా ఆడదైతే చాలని మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారు. దేశంలో తరచూ ఇటువంటి ఘటనలు వెలుగుచూడగా, శిక్షలు అమలు చేసినా కొందరు దుర్మార్గులు మాత్రం మారడం లేదు. రక్తసంభందం, వరుసలు వంటి ఆలోచనలు చేయకుండా తమ కామాన్ని తీర్చుకుంటున్నారు. ఇదే తరహాలో తాజాగా ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య మొదటి భర్త కూతుళ్లపై రెండో భర్త లైంగిక దాడికి దిగాడు. అంతేకాదు, ఈ దుర్మార్గపు చర్యకు రెండో భర్తకు భార్యే సహకరించడం గమనార్హం.
భార్య సహకారంతోనే...
భార్య మొదటి భర్త చనిపోవడంతో...భార్య రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు. పుట్టా సతీష్ కుమార్ (43) అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సదరు మహిళ కొన్నాళ్లు కలిసి జీవనం సాగించారు. అయితే, తనకు పిల్లలు కావాలని పెళ్లి చేసుకున్న సతీష్ మహిళను అడిగాడు. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మహిళ దారుణ పనికి ఒడిగట్టింది.
తన మొదటి భర్త పిల్లలను సతీష్ వద్దకు పంపింది. యువతులు వెళ్లనని ఏడ్చినా పట్టించుకోకుండా, బలవంతంగా పంపించింది. దీంతో టెన్త్ క్లాస్ చదువుతున్న మొదటి కుమార్తెపై సతీష్ లైంగిక దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆగని దుర్మార్గులు మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మళ్లీ యువతి గర్భం దాల్చింది. భార్య మొదటి కూతురిపై దారుణానికి పాల్పడింది చాలక...రెండో కుమార్తెపై కూడా వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండో కుమార్తె కూడా గర్భం దాల్చించి. కానీ, ఆ యువతి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతటి దారుణానికి భార్య సహకారంతోనే భర్త పాల్పడటం షాకింగ్‌గా మారింది. దీంతో, భార్య మొదటి భర్త ఇద్దరు కూతుళ్లపై రెండో భర్త ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన పెదపాడు మండలంలో తీవ్ర కలకలం రేపింది.
విభేదాలే కారణం..
సదరు మహిళకు, రెండో భర్త సతీష్ కుమార్ కు మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఇరువురి మధ్య విభేదాలు రావడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘోర విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్‌లో నిందితులైన సదరు మహిళ, లైంగిక దాడికి పాల్పడిన సతీష్‌లపై కేసు నమోదు అయ్యింది. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితులపై పోక్సో, లైంగిక దాడుల కేసు నమోదు అయ్యింది.