ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధి దాటుతోందని విమర్శలు చేసిన మాజీ తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రుపై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కొంత మంది మీడియా లైమ్‌లైట్‌లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.. లైట్స్ఆఫ్ చేస్తామని ధర్మానసం మండిపడింది.  ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని బట్టు దేవానంద్  వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు అంశాలను చూపించి మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించారు.  ‘‘ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్‌పై విచక్షణారహితంగా కొట్టారు హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించండి. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా?.’’ అని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.


Also Read: ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్.. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు అమలు చేయండి


న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థనూ దూషించిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పంచ్‌ ప్రభాకర్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి సీబీఐని ఆదేశించడాన్ని కూడా జస్టిస్ చంద్రు తప్పు పటచ్టారు. అయితే ఈ కేసులో హైకోర్టు మరింత కఠినమైన వైఖరి తీసుకుంది. ఇంత వరకూ పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయకపోవడంపై సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  జనవరి 25లోపు పూర్తిస్థాయిలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విదేశాల్లో కూర్చొని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థను విమర్శించడంపై హైకోర్టు సీరియస్‌ అయింది. మన వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది.


Also Read: Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు 


విచారణలో పంచ్‌ ప్రభాకర్‌కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ చెప్పింది. అరెస్ట్ చేయలేకపోవడానికి అదో కారణంగా చెప్పడంతపై హైకోర్టు తరపు న్యాయవాది అశ్వినీ కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు సంబంధించిన వాళ్లు చాలా మంది ఇక్కడ ఉన్నారని.. ఆయన ఆస్తులు ఉన్నాయని.. వాటి గురించి సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు.  నిందితుల పరస్పర అప్పగింత ఒప్పందంలో  భాగంగా సీబీఐ ఎందుకు పనిచేయలేకపోతుందని ప్రశ్నించారు. సీబీఐ వేసిన అఫిడవిట్‌లో ఎటువంటి కొత్త విషయాలు లేవని స్పష్టం చేశారు. 


Also Read: Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !


సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారాలు, సీబీఐ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. సమాచారం ఇవ్వడం లేదని సీబీఐ ..అడిగిన సమాచారాన్ని తాము ఎప్పటికప్పుడు ఇస్తున్నామని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారాల న్యాయవాదులుప ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  జనవరి 25వ తేదీలోపు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అందులో అంశాలు, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్‌కు తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐను హైకోర్టు ధర్మాసనం  ఆదేశించింది. ఆ తరువాత  తగిన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 


Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి