కరోనా పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నానితోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయడమే కొవిడ్ నివారణకు పరిష్కారమని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తిచెందకుండా ఆంక్షలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఎయిర్ పోర్టుల్లో చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధించినట్టు చెప్పారు. మరో వారం రోజుల్లో జీనో సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఈనెలాఖరు వరకు 144 పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
నాడు-నేడు పనుల ప్రగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. నాడు – నేడు కింద చేస్తున్న కార్యక్రమాల్లో గతానికి ఇప్పటికీ.. తేడా స్పష్టంగా కనిపంచాలని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల్లో దీని కోసం హోర్డింగ్ పెట్టాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలందాలంటే ఎక్కడకు వెళ్లాలన్న దానిపై వారికి అందుబాటులో సమాచారం ఉండేలా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ అనేది రిఫరల్ పాయింటల్ కావాలని సీఎం జగన్ సూచించారు. అవి వచ్చేంతవరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎం బాధ్యత తీసుకోవాలన్నారు.
సమర్థవంతంగా ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని సమీక్షలో నిర్ణయించారు. ఇందులో సందేహాలను నివృత్తిచేసే ఏర్పాటూ ఉండాలని సీఎం సూచించారు. యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఇవ్వాలని.. వారికి సెల్‌ఫోన్లు సమకూర్చేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రుల్లో పెట్టిన ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం అన్నారు. 108, 104 వాహనాలు సమర్థవంతంగా ఉండాలన్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదని ఆదేశించారు.
విశాఖ, కాకినాడలో ఎంఐఆర్‌ఐ, క్యాథ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. కర్నూలులో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అరకు, పాడేరులో అనస్థీషియా, ఈఎన్టీ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.37 కోట్లు ఖర్చు చేయనుంది. యంత్రాంగం చేపడుతున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు చెప్పారు.
Also Read: Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు
Also Read: Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !
Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు