Andhra High Court : సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి చనిపోయిన దళితుడు సింగయ్య మృతి కేసులోతనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టును జగన్ ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు గురువారం పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏ 2గా చేర్చారు.
సత్తెనపల్లికి వెళ్తూ గుంటూరుర శివారులో రోడ్ షో
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి చెందిన కార్యకర్త ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇటీవల విగ్రహావిష్కరణకు వెళ్లారు. ఆయన పర్యటన సమయంలో గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్డు వద్ద ఓ వృద్దుడుచనిపోయాడు. ఆ సమయంలో పోలీసులు జగన్ కాన్వాయ్ వాహనం కాదని.. వేరే వాహనం ఢీకొట్టిందని చెప్పారు. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు. నాలుగు రోజుల తర్వాత జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడని దృసశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చెప్పిన దానికి..బయటపడిన దృశ్యాలకు చాలా తేడా ఉండటంతో విమర్శలు వచ్చాయి. దాంతో పోలీసులు కేసును మార్చారు.
కారు కింద పడిన వ్యక్తిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయిన కార్యకర్తలు
ఏ వన్ గా జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని.. ఏ 2గా కారులో ఉన్న జగన్ ను చేర్చారు. పర్యటనలో పాల్గొన్న ఇతర నేతలపైనా కేసులు పెట్టారు. A3-A6 నాగేశ్వర్ రెడ్డి (జగన్ వ్యక్తిగత కార్యదర్శి), వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ ఉన్నారు. ఈ వ్యక్తులు జగన్ కారులో లేనప్పటికీ, అనుమతులకు మించి కాన్వాయ్‌లో వాహనాలు, జన సమీకరణ వల్ల ఘటన జరిగిందని పోలీసులుఆ తర్వాత రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏఆర్ కానిస్టేబుల్ గా చెబుతున్నారు. జగన్ పోలీసులు పెట్టిన ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ చేయడం, కారు కింద మనిషి పడినా కనీస వైద్యం అందించకుండా రోడ్డు పక్కన పడేసి పోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇప్పటికే ప్రమాదానికి కారణం అయిన జగన్ కారు సీజ్
పోలీసులు కేసు నమోదు చేసుకుని జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు.. ఆయనను ఎందుకు ఆస్పత్రికి తరలించలేదు అనే దానిపై విచారణ జరిపారు. జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. అందరూ జనాల్లో ఏం జరిగిందో తెలియలేదని చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు చెప్పలేదు. గుంటూరు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ బుల్లెట్ ఫ్రూఫ్ కారును సీజన్ చేశారు. జగన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో.. ముందస్తుగా క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా భావిస్తున్నారు.