heroine Poonam Kaur : ఓ అమ్మాయి కెరీర్ ను నాశనం చేసిన విషయంలో తాను చేసిన ఆరోపణలు.. రాజకీయ నాయకుడిగా మారిన నటుడి గురించి కాదని ఓ దర్శకుడి గురించి అని హీరోయిన్ పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. హాఫ్ పంజాబీ అయిన ఆ యాక్టర్‌కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సహకారం అందిస్తోందన్నారు. అనవసరంగా రాజకీయాలతో సంబంధం లేకపోయినా అందులోకి లాగుతున్నారని అందుకే తాను క్లారిఫికేషన్ ఇస్తున్నట్లుగా పూనమ్ కౌర్ చెప్పారు.
హీరోయిన్ పూనమ్ కౌర్ ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేశారు. అతను చేసిన అన్యాయంపై తాను గతంలో సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం చేయలేదని మండిపడ్డారు. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు. కానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.
వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
కారణం ఏదైనా గత ఐదారేళ్లుగా పూనం కౌర్.. టార్దెటెడ్ కా కొన్ని ట్వీట్లు పెడుతూ వస్తున్నారు. అవి రాజకీయాల్లో వచ్చిన ఓ నటుడిని ఉద్దేశించి చేసినవని ఆ నటుడి వ్యతిరేక పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ పేరు బయట పెట్టలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా పూనంకౌర్ ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేస్తూనే ఉంటారు. వాటిని ఆ హీరోకి అన్వయించి ఇతర పార్టీల కార్యకర్తలు ట్రోల్ చేస్తూనే ఉంటారు.
తాజాగా టాలీవుడ్లో జానీ మాస్టర్ వివాదం తర్వాత మరింత ఎక్కువగా మహిళలపై వేధింపుల గురించి చర్చ జరుగుతూండటంతో పూనమ్ కౌర్ అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే పూనంకౌర్ ఇందులో తానే బాధితురాలనని ట్వీట్లో ఎక్కడా చెప్పలేదు. హాప్ పంజాబీ గర్ల్ అని మాత్రమే హింట్ ఇచ్చింది. అందులో కాస్త సున్నితమైన ఆరోపణలు కూడా ఉన్నాయి..తన కెరీర్ ముగిసిపోవడానికి కారణం అయ్యారని కూడా ఆరోపించడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించే ఇలా పెట్టారని నెటిజన్లు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.