నెల్లూరు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్ లో సిబ్బందికి కరోనా సోకిందనే వార్తల నేపథ్యంలో అక్కడ  సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇటీవల సూళ్లూరుపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా కరోనా కలకలంతో ఆఫీస్ మూసి వేశారు. ఈసారి 10 వేల మంది కార్మికులు పనిచేసే అపాచీ కర్మాగారంలో కరోనా కలకలం రేగింది. నెల్లూరుజిల్లా తడ మండలం మాంబట్టు గ్రామంలో ఉన్న అపాచీ ఫుట్ వేర్ కంపెనీలో దాదాపు 100 మంది ఉద్యోగులకు కరోనా సోకిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక్కడ కరోనా సోకినవారిలో విదేశాలకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో అధికారులు ఈ విషయంపై ఆరా తీశారు. స్థానిక ఉద్యోగులు అపాచీలో పనికి వెళ్లేందుకు భయపడుతున్నారు. అసలు ఎంతమందికి కరోనా నిర్ధారణ అయిందనే విషయాన్ని బయటకు రానీయడం లేదు.


రాష్ట్రంలో..


ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 36,452 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 1831 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 242 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,974 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 7195 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,84,674కి చేరింది. గడిచిన 24 గంటల్లో 242 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 7195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,505కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,16,66,683 శాంపిల్స్ పరీక్షించారు.  


దేశంలో కరోనా కేసులు


రోజురోజుకి పెరుగుతోన్న కరోనా కేసులు తాజాగా స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదుకాగా 277 మంది మృతి చెందారు. 69,959 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు.  దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 2.29%గా ఉంది. రికవరీ రేటు 96.36%గా ఉంది.  మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4461కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 


మహారాష్ట్ర.. 


మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. కొత్తగా 33,470 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది వైరస్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 69,53,514కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,41,647కు చేరింది.  మహారాష్ట్రలో కొత్తగా 31 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,247కు పెరిగింది. కొత్తగా నమోదైన 31 కేసుల్లో 28 పుణె నగరంలోనే వెలుగుచూశాయి.


Also Read: ప్రభుత్వం చాలా పెద్దది.. ఎవరూ ఏం చేయలేరు.. మీరే నష్టపోతారు జాగ్రత్త: అజయ్ జైన్ 


Also Read: Sachivalaya Employees: 'మీరు టెంపరరీ ఎంప్లాయిస్... ఏరోజైనా తీసేయొచ్చు'... సచివాలయ ఉద్యోగులపై వ్యవసాయశాఖ జేడీ సంచలన వ్యాఖ్యలు