Chandrababu Case : స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై గతంలో వాదనలు విన్న ధర్మాసనం.. క్వాష్ పిటిషన్ పై తీర్పుతో ముడిపడి ఉన్నందున తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇవాళ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది.
బెయిల్ రద్దు చేయాలంటున్న ఏపీ ప్రభుత్వం
స్కిల్ కేసుకు సంబంధించి 17ఏ వ్యవహారంపై ఇప్పటికీ తీర్పు వెలువరించలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. వాయిదా వేయకుంటే విచారణ తేదీని చెప్పాలని ధర్మాసనాన్ని కోరారు. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని హరీష్ సాల్వే తెలిపారు. అదే సమయంలో ఈ అంశం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాల్వే వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. తేదీ ఖరారు చేయాలని హరీశ్ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. సాల్వే విజ్ఞప్తితో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 19కి వాయిదా వేసింది. జనవరి 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఆ కౌంటర్‌కు రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
క్వాష్ పిటిషన్ పై తీర్పు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. గత విచారణ సమయంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత విచారణ చేస్తామని తెలిపామని ఆ తీర్పు ప్రాసెస్ లో ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పన్నెండో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు డిసెంబర్ పన్నెండో తేదీ లోపు వస్తుందని భావిస్తున్నారు.
క్వాష్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ
క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. వాటికి విచారణ అర్హత కూడా ఉండదు. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం.. అన్ని కేసుల్లో విచారణలు దాదాపుగా పూర్తయినందున.. తీర్పులు వెల్లడించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబును రాజకీయానికి దూరం చేయాలనుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. క్వాష్ పిటిషన్ పై తీర్పుతో అన్నీ తేలిపోనున్నాయి.