Pawan Vs Minister :   జనసేన అధినేత పవన్ కల్యాణ్  ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి వైఎస్ఆర్పీపీ మంత్రులు రెడీగా ఉంటారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఈ విషయంలో దూకుడుగా ఉంటారు. పవన్ కల్యాణ్ తాజాగా తన ట్వీట్టర్ అకౌంట్ లో మార్షల్ ఆర్ట్స్ ఫోటో ఒకటి పెట్టారు. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పారు.





పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో  ప్రవేశం వుంది. కొన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపించారు పవన్ . ప‌వ‌న్ న‌టిస్తన్న తాజా చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. క్రిష్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. సినిమాలో క‌థానుగుణంగా వీర‌మ‌ల్లు పాత్రకు మార్షల్ ఆర్ట్స్ విద్య అవ‌స‌ర‌మైనందున.. దీనికోసం ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నారు పవన్. త‌న‌లోని మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిని పూర్తి స్థాయిలో ఇందులో చూపించ‌బోతున్నారు. ఇటివలే త‌న ట్రైన‌ర్‌తో క‌లిసి మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ని చిత్ర యూనిట్ పంచుకుంది.  పవన్ కళ్యాణ్ ఒక పర్శనల్ ఫోటో ని ఫేస్ బుక్ లో పంచుకున్నారు. ”రెండు దశాబ్దాల తర్వాత నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ లోకి వచ్చాను.”అని రాశారు.  17వ శతాబ్దంలో మొగ‌లుల కాలం నాటి వీర‌మ‌ల్లు జీవిత క‌థతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలోబాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, నిధి అగ‌ర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.  పవన్ పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. లక్షలకుపైగా పైగా లైక్స్ వచ్చాయి. 



ఈ ఫోటోపై గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఇది మార్షల్ ఆర్ట్సా అంటూ వెటకారంగా స్పందించారు. 





గుడివాడ  అమర్నాథ్‌పై పవన్ ఫ్యాన్స్ దారుణంగా విరుచుకుపడుతున్నారు. కొంత మంది సెటైరిక్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు.