Konaseema Curfew : తీవ్ర ఉద్రిక్తంగా మారిన కోనసీమ జిల్లాలో కర్ఫ్యూ విధించాలని పోలీసులు నిర్ణయించారు. బుధవారం నుంచి జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి సున్నితంగా ఉన్నందున... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. లా అండ్ ఆర్డర్ ( Law And Order ) అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదం కొద్ది రోజులుగా సాగుతోంది. పేరు మారుస్తూ జీవో జారీ చేసినప్పటి నుండి నిరసనలు జరుగుతున్నాయి. అవి ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనలు జరుగుతున్నందున అమలాపురంలో ( Amalapuram ) 144 సెక్షన్ ఇప్పటికే అమలు చేస్తున్నారు . అమలాపురంలో 25 చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఎవరి కుట్రో తెలియడం లేదు - సజ్జల, హోంమంత్రి రియాక్షన్ !
అయితే మ ఒక్కసారిగా జేఎసీ ( JAC ) నేతృత్వంలో ఆందోళనకారులు గడియారం స్థంభం నుండి కలెక్టర్ కార్యాలయం ( Collectorate ) వరకు ర్యాలీని ప్రారంభించారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.ఈ సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. SP వాహనంపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే అక్కడే ఉన్న డీఎస్పీ, గన్ మెన్లు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా చితకబాదారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను తరలించేందుకు తీసుకు వచ్చిన వాహనాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలు వాహనాలు ద్వంసమయ్యాయి. ఆందోళనకారులు తరలించేందుకు వెచ్చిన రెండు వాహనాలను దగ్దం చేశారు. ఆందోళనకారుల దాడిలో డీఎస్పీతో పాటు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జీలో కూడా పలువురు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు.
అగ్ని గుండంలా అమలాపురం- కొనసాగుతున్న విధ్వంసకాండ
కోనసీమ జిల్లాగానే ( Konaseema District ) పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆందోళనలు నిర్వహిస్తుంంది. బుధవారం కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. నల్ల వంతెనల దగ్గర నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. అయిుతే బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. తాజాగా కర్ఫ్యూ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ కర్ఫ్యూ ( Curfew ) అమల్లో ఉండనుంది. దీంతో కోనసీమలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అన్న ఉత్కంఠ ప్రారంభమయింది.
మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?