Visakhapatnam Google AI hub: విశాఖలో గూగుల్ పెట్టబోయే పెట్టుబడి మరో ఐదు బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇప్పటి వరకూ పది బిలియన్ డాలర్లను వచ్చే ఐదేళ్లలో పెట్టుబడిగా పెడతారని అనుకున్నారు. కానీ అది పదిహేను బిలియన్ డాలర్లకు పెంచినట్లుగా ఒప్పందం సమయంలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. విశాఖపట్నం AI హబ్ భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు ల్యాండ్‌మార్క్ పెట్టుబడి ఇది అమెరికా వెలుపల మా అతిపెద్ద AI హబ్‌గా ఉంటుంది, భారత్‌తో పాటు ఆసియా దేశాలకు కూడా సేవలు అందిస్తుంది అని గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియాన్ ప్రకటించారు.
ఈ ఒప్పందం తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ లో స్పందించారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడానని.. విశాఖపట్నంలో మా మొదటి AI హబ్ ప్రణాళికలు పంచుకున్నానని తెలిపారు. ఇది ల్యాండ్‌మార్క్ డెవలప్‌మెంట్. గిగావాట్ స్థాయి కంప్యూట్ కెపాసిటీ, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, పెద్ద ఎత్తున ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఇది భారతదేశ AI ఆవిష్కరణలను వేగవంతం చేస్తుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. గూగుల్ ఎఐ హబ్ వల్ల పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. భారతీయ సంస్థలు, డెవలపర్లు, యూజర్లకు కట్టింగ్-ఎడ్జ్ AI టెక్నాలజీని అందించి, దేశవ్యాప్తంగా ఆవిష్కరణలు, ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
AI హబ్ : ఏమిటి ఈ సూపర్ పవర్‌ఫుల్ సెటప్?
విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఈ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ భారతదేశంలోనే అతిపెద్దది. గిగావాట్ స్థాయి AI కంప్యూటింగ్, TPU మరియు GPU ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ – AI మోడల్స్ ట్రైనింగ్, డెవలప్‌మెంట్‌కు అవసరమైన సూపర్ కంప్యూటర్ స్థాయి పవర్. కొత్త అంతర్జాతీయ సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS), గూగుల్ గ్లోబల్ ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌తో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇది డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌ను 100 రెట్లు పెంచుతుంది. పెద్ద ఎత్తున పర్యావరణ స్నేహపూర్వక ఎనర్జీ సోర్సెస్, సోలార్ , విండ్ పవర్‌తో పనిచేస్తుంది. ఇది AI ఆపరేషన్‌లకు అవసరమైన భారీ ఎనర్జీని సస్టైనబుల్‌గా అందిస్తుంది.
ఈ పెట్టుబడి భారత AI మిషన్‌కు కీలకం. IT ప్రొఫెషనల్స్‌కు స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ ఎకానమీకి బూస్ట్ ఇస్తుందని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.8 లక్షలకు పైగా ఉద్యోగాలు (డైరెక్ట్ & ఇన్‌డైరెక్ట్) యువతకు లభిస్తాయి. విశాఖపట్నాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చుతుంది. భారతీయ స్టార్టప్‌లు, సంస్థలు గూగుల్ AI టూల్స్ (జెమిని, వెర్సటైల్ AI మోడల్స్)ని ఉపయోగించి, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి రంగాల్లో ఆవిష్కరణలు చేయవచ్చు.
అదాని గ్రూప్ కూడా గూగుల్ తో జత కట్టింది. అదాని గూగుల్ పార్ట్‌నర్‌షిప్‌తో విశాఖలో అతిపెద్ద AI డేటా సెంటర్ నిర్మిస్తున్నాము. AI డిమాండ్‌లకు స్పెషల్‌గా డిజైన్ చేసినది అని ప్రకటించారు. భారతీ ఎయిర్‌టెల్ కూడా డేటా సెంటర్ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. మొదటి ఫేజ్‌లో డేటా సెంటర్ నిర్మాణం, 2026లోపు ఆపరేషన్స్ మొదలవుతాయి. గూగుల్ AI స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లు, లోకల్ డెవలపర్ కమ్యూనిటీలకు సపోర్ట్ కూడా భాగమవుతాయి. ఈ పెట్టుబడి గ్లోబల్ టెక్ జెయింట్స్ మధ్య పోటీలో భాగం – అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా భారత్‌లో AI ఇన్‌వెస్ట్‌మెంట్స్ పెంచుతున్నాయి.