AP Weekly Five Days :  అమరావతి ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు మరో ఏడాది పొడిగిస్తూ సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. వీరితో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రభుత్వ సంస్థలు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేసే విధంగా  వారానికి ఐదు పని దినాల విధానం వర్తిస్తుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. విభ‌జ‌న త‌రువాత ఎపీలో ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం ప‌ని దినాల పై కొంత మేర‌కు వెసులుబాటు ను క‌ల్పించింది.


గత ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన సౌకర్యం 


హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ వ‌చ్చి అమ‌రావ‌తి స‌చివాల‌యంలో ప‌ని చేసే ఉద్యోగులు త‌మ కుటుంబాలు వేరొక చోట ఉండ‌టంతో ప్ర‌భుత్వం ఈ అవ‌కాశం క‌ల్పించింది. ఇప్ప‌టికి 8ఎళ్ళు పూర్త‌య్యింది. మ‌రో ఎడాది పాటు కూడా ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తూ సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఉమ్మ‌డి రాజ‌దానిగా ఇప్ప‌టికి హైద‌రాబాద్ కొన‌సాగుతున్న‌ కారణంగా ఇంకా చాలా మంది ఉద్యోగులు,అధికారులు హైద‌రాబాద్ నుండి రాక‌పోక‌లు సాగిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం ఈ విష‌యం పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. 


ఇప్పుడు మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం 


ఉద్యోగుల‌కు సంబంధించిన అంశాన్ని ప్ర‌త్యేకంగా ప‌రిశీలిచిన స‌ర్కార్ ఎడాది పాటు పాత విధానంలోనే ప‌ని చేసే విదంగా స‌దుపాయం క‌ల్పించింది. ఇప్ప‌టికే ఉద్యోగులు డిమాండ్ల పై ఎపీ ప్ర‌భుత్వం పూర్తి స్దాయిలో దృష్టి సారించ‌లేద‌ని, హామిల‌ను అమ‌లు చేయ‌లేద‌నే అసంతృప్తి లో ఉన్నారు. అందుకే  ఉద్యోగుల‌ను మెప్పించి వారితో ప‌ని చేయించుకునేందుకు అవ‌స‌రం అయిన అన్ని మార్గాల‌ను ప్ర‌భుత్వం అన్వేషిష్తోంది. జీపీఎఫ్ సొమ్ము విష‌యంలో కూడ ఉద్యోగుల సంఘాలు ప్ర‌భుత్వం పై అసంతృప్తిగా ఉన్నారు.  ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా వివ‌ర‌ణ ఇచ్చింది.


ఉద్యోగులకు మేలు చేస్తామంటున్న ప్రభుత్వం 


ఆ త‌రువాత అమ‌రావ‌తి స‌చివాల‌య ఉద్యోగుల‌కు  క‌ల్పించిన వ‌స‌తి విష‌య‌లో కూడ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం పై ఉద్యోగుల నుండి అసంతృప్తి వ్య‌క్తం అయ్యింది. దీంతొ ప్ర‌భుత్వం వెంట‌నే త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకొని వ‌స‌తి స‌దుపాయాల‌ను మ‌రో రెండు నెల‌ల పాటు పొడిగించింది.ఇప్పుడు కూడా  వారానికి ఐదు పని దినాలు మరో ఏడాది పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు ఇవ్వ‌టం ద్వారా ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం అండ‌గా ఉంటామ‌నే సంకేతాలు పంపేందుకు ప్ర‌య‌త్నిస్తోందనే ప్ర‌చారం జ‌రుగుతుంది.