పాన్- ఆధార్ అనుసంధానం చేశారా? చెయ్యకపోతే ఈరోజే (2022, June 30) పూర్తి చేయండి. ఎందుకంటే ఆధార్- పాన్ అనుసంధానం తుది గడువు గురువారంతో ముగుస్తుంది. ఒక వేళ ఈలోపు అనుసంధానం చెయ్యకపోతే పాన్ పనిచేయడం ఆగిపోతుంది. రెట్టింపు ఆలస్య రుసుము రూ.1000 వరకు చెల్లించాల్సి వస్తుంది.  


లింక్ చేయకపోతే


గడువులోపు పాన్-ఆధార్​​ లింక్ చేయకపోతే.. ఆలస్య రుసుము కింద రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక బిల్లు 2021లో సవరణలు చేసి.. సెక్షన్​ 234హెచ్​ను ప్రభుత్వం కొత్తగా చేర్చింది. గడువులోపు ఈ ప్రక్రియ పూర్తవకుంటే.. పాన్​ నిర్వీర్యం అవుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి పాన్​ను ఐటీ సేవలకు వినియోగిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 272బీ ప్రకారం.. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వాస్తవంగా మార్చి 31తో ముగిసిన గడువును కేంద్ర ప్రభుత్వం జూన్‌ 30 వరకు పొడగించింది. అయితే మార్చి 31 నుంచి జూన్‌ 30లోపు అనుసంధానం చేసేవారు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలని ప్రత్యక్ష పన్నుల శాఖ నోటిఫై చేసింది. ఇప్పుడు దానిని వెయ్యికి పెంచింది.


పాన్ లింక్ ఎలా? 



  • కొత్త ఇన్​కం ట్యాక్స్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportalను ఓపెన్​ చేయాలి

  • లింక్ ఆధార్ ఆప్షన్​ను ఎంచుకోవాలి.

  • అందులో.. ఆధార్​, పాన్ వివరాలు నింపాలి.

  • తర్వాత మొబైల్ నంబర్​ ఎంటర్​ చేయాలి.

  • ఆధార్ వెరిఫికేషన్​కు పేజీలో.. I agree to validate my Aadhaar details అనే ఆప్షన్​ను టిక్ చేయాలి.

  • ఆ తర్వాత లింక్ ఆధార్​ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే సరిపోతుంది. 


ఎస్​ఎంఎస్​ ద్వారా..


మీ మొబైల్ నంబర్​ నుంచి ఎస్​ఎస్​ఎస్​ పంపడం ద్వారా కూడా పాన్​-ఆధార్​ లింక్ చేయొచ్చు. ఇందుకోసం UIDPAN అని టైప్​ చేసి స్పేస్ ఇచ్చి.. 12 అంకెల ఆధార్​ నంబర్​ను, 10 అంకెల పాన్​ నంబర్​ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్​ను 567678 లేదా 56161కు పంపాలి. దీనితో పాన్-ఆధార్​​ లింక్ పూర్తవుతుంది.


లింక్​ స్టేటస్​ తెలుసుకోవడం ఎలా?


కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా లింక్​ ఆధార్​ స్టేటస్​పై క్లిక్​ చేసి.. ఆధార్​, పాన్​ నంబర్​లను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్​ క్లిక్ చేయడం ద్వారా లింక్ స్టేటస్​ తెలుసుకోవచ్చు.


ఎస్​ఎంఎస్ ద్వారా అయితే..


12 అంకెల ఆధార్​ నంబర్​ను ఎంటర్​ చేసి స్పేస్​ ఇచ్చి.. 10 అంకెల పాన్​ నంబర్​ను ఎంటర్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్​ పంపడం ద్వారా లింక్ స్టేటస్​ను తెలుసుకోవచ్చు.