Mla Vallabhaneni Vamsi : టీడీపీ గొప్ప పార్టీ, ఆ పార్టీని ఎప్పుడూ తిట్టలేదు, లోకేశ్ తీరు నచ్చకే విమర్శలు - వల్లభనేని వంశీ

ABP Desam Updated at: 30 May 2022 10:15 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Mla Vallabhaneni Vamsi : టీడీపీ గొప్ప పార్టీ ఆ పార్టీని తానెప్పుడూ తిట్టలేదని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ను విమర్శించానే తప్ప టీడీపీని ఎప్పుడూ విమర్శించలేదన్నారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

NEXT PREV

Mla Vallabhaneni Vamsi : తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ, ఆ పార్టీని ఎప్పుడూ తిట్టలేదని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ అన్నారు.  నారా లోకేశ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ విధానాలను దెబ్బతిన్నాయని విమర్శలు చేశారన్నారు. వైసీపీలో కొందరు వ్యక్తులు తన మీద ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ పార్టీలో తనతో కలిసి పనిచేసే వాళ్లను కలుపుకునిపోతానన్నారు. తన స్థాయి కాని వారు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. పంచాయతీ వార్డు మెంబర్లుగా గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు.  మట్టి అమ్ముకునే కర్మ తనకు పట్టలేదన్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఏ సర్పంచ్ అయినా మట్టి అమ్ముకుంటే బుక్ చేయండని సూచించారు.  


వల్లభనేని వంశీ హాట్ టాపిక్


గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ, ఆ తర్వాత వైసీపీ వైపు షిఫ్టు అయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో వంశీ మౌనం వహించారు. ఆ తరువాత పరిణామాల మారుతుండడంతో రూటు మార్చారు. టీడీపీ నుంచి గెలిచి సీఎం  జగన్ కు జై కొట్టారు. సీఎం జగన్ పాలన నచ్చి టీడీపీకి దూరం అయ్యానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సమయం దొరికినప్పుడల్లా వంశీ టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. నారా లోకేశ్ తో చాలా విషయాల్లో గ్యాప్ ఉండడం, పరోక్షంగా తనను లోకేశ్ టార్గెట్ చేశారనే అనుమానాలు ఇప్పటికీ వంశీకి ఉన్నాయి. మంత్రి కొడాలి నానితో వంశీకి ఉన్న సాన్నిహిత్యంతో వైసీపీకి షిప్ట్ అయ్యారు. కొడాలి నాని అండగా ఉంటారనే నమ్మకంతో సైకిల్ దిగారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు సడన్ గా మళ్లీ వంశీ తెలుగుదేశాన్ని పొగడడం ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. 


టీడీపీ గొప్ప పార్టీ 



తెలుగుదేశం పార్టీని నేను ఎప్పుడూ తిట్టలేదు. టీడీపీని లోకేశ్ నడిపిన తీరును విమర్శించాను. టీడీపీ గొప్పపార్టీ. స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. సామాజిక న్యాయం చేసిన పార్టీ. ఎన్టీఆర్ వల్ల ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని వారు రాజకీయాల్లో గెలిచారు. రాజకీయాల్లో చాలా సేవచేశారు. ఇప్పుడు లోకేశ్ చేతుల్లోకి వెళ్లాక దాని విధానం సరిగ్గా లేదని విమర్శించారు. దాని మీద రామచంద్రరావు ఏమైన ఉంటే ఆయనను అడగాలి. నాతో కలిసి వచ్చేవారితో కలిసి పనిచేస్తాను. ఊళ్లో సర్పంచ్ గా గెలవని వాళ్లు, జనసేన, టీడీపీ వాళ్లతో కలిసి పోటీ చేసినవాళ్లు, పక్క నియోజకవర్గంలో సొంత పిన్ని ఓటించిన వాళ్లు నా గురించి మాట్లాడితే నేను ఏం చెబుతాను. నా గురించి మాట్లాడితే టీవీల్లో చూపిస్తారని కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు.- - వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే

Published at: 30 May 2022 10:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.