YS Viveka Case :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో    A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కేసు  పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేస్తూ ..  తెలంగాణ హైకోర్టు   ఆదేశాలపై వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై  బుధవారం వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరిగింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారించాలని గంగిరెడ్డి తరపు న్యాయవాది కోరారు. జులై 1వ తేదీ తరువాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎనిమిదో వింత లా ఉందని సీబీఐ తరపున హాజరైన న్యాయవాది ఏఎస్‌ జీ సంజయ్ జైన్ పేర్కొంటూ.. గంగిరెడ్డి పిటీషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో సుప్రీం కోర్టు ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.        


ఏపీ ప్రభుత్వ ఆర్థిక కష్టాల్ని తీరుస్తున్న కేంద్రం - రాజకీయంగానూ బీజేపీ సంకేతాలు పంపినట్లేనా ?            
 
గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేసిన వ్యవహారంపై వైఎస్ వివేకా కుమార్తె సునీతా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 30వ తేదీ లోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ మరుసటి రోజు జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జులై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ట్రయిల్ కోర్టును ఆదేశిస్తూ... బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. జులై 1న బెయిల్ ఇవ్వాలని షరతు విధిస్తూ... హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... సునీత  సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని గత వారం సీజేఐ ముందు సునీత తరపు న్యాయవాది మెన్షన్ చేశారు.                      


కాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ తల పట్టుకున్నారు. ఈ క్రమంలో విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసిన సీజేఐ ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.            


ఆయనొస్తున్నారని ఊరంతా ఖాళి - పూతలపట్టు ఎమ్మెల్యేకు అవమానం !      


సీబీఐ న్యాయవాది కౌంటర్ దాఖలుకు సమయం కోరినందున.. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత గంగిరెడ్డి బెయిల్ రద్దు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.