Tammineni Sitaram said that it is not ghee that has been adulterated : తిరుపతి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ విషయంలో చాలా మంది చాలా కోణాలు విశ్లేషించారు కానీ.. ఎవరూ ఊహించని మార్గాన్ని మాత్రం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విశ్లేషించారు. అదేమిటంటే.. నెయ్యిలో కల్తీ లేదు..కానీ ఆవే కల్తీ అయింది. ఈ కాన్సెప్ట్ కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇదే విషయాన్ని ఆయన నేరుగా చెప్పారు. పైగా తన దాదనకు బలంగా తన పరిశోధనా వివరాలను కూడా వెల్లడించారు. తమ్మినేని సీతారాం మాటల్లో అసలేం  జరిగిందంటే..  


15 వేల కేజీల నెయ్యి తయారీకి 3.75 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఒక్కో ఆవు 10 లీటర్ల పాలు ఇస్తుంది అనుకుంటే, 37 వేల ఆవులకు ఒకేసారి మంచి గడ్డి, దాణా ఇవ్వలేదు, అందుకే నెయ్యి కల్తీ అయ్యిందని  తమ్మినేని చెబుతున్న వీడియో వైరల్ అయింది. అంటే ఆవే కల్తీ అయిందని తమ్మినేని చెప్పినట్లన్నమాట. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన టీడీపీ.. తమ్మినేనికి సైంటిస్ట్ అనే బిరుదు ఇచ్చింది.  





తమ్మినేని సీతారం మాజీ స్పీకర్, మాజీ మంత్రి కూడా. అయితే ఆయన పెద్దగా చదువుకోలేదు. డిగ్రీ డిస్ కంటిన్యూ చేశారు. కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన తాను డిగ్రీ పూర్తి చేశానని సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారు. ఆ సర్టిఫికెట్ నకిలీదన్న ఆరోపణలు వచ్చాయి.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన డిగ్రీ పూర్తి చేసినట్లుగా చెప్పలేదు. డిగ్రి డిస్ కంటిన్యూ చేశానని చెప్పారు. ఇప్పుడు  హైదరాబాద్ లా కాలేజీలో ఆయన సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ పై విచారణ చేయించాలని ఆముదాల వలసలో ఆయనపై పోటీ చేసి గెలిచిన కూన రవికుమార్ ఇటీవల చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. 


కూటమిలో బాలినేని ఉక్కపోత ఖాయం - వదిలేది లేదంటున్న దామచర్ల - ఇక దారేది ?


గతంలో కూడా తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు   హిలేరియస్ గా ఉండి ట్రోలింగ్ కు గురవుతూ వచ్చాయి. ఇప్పుడు చెప్పింది  మాత్రం మరింత ఎక్స్ ట్రీమ్ గా ఉండటంతో సోషల్ మీడియాలో  వైరల్  అవుతోంది. టీడీపీ నేతలు  తమ్మినేని సీతారంను పూర్తి స్థాయిలో ట్రోల్ చేస్తూ.. ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.                                


Also Read: బెజవాడ ప్రజలకు సాయం చేసింది  ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !