Vijayawada flood victims: విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని బాధితుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. మొత్తం రూ. 602 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టపరిహారంగా పంపిణీ చేస్తే..అందులో రూ. నాలుగు వందల కోట్లు ప్రజల నుంచి విరాళాలుగా వచ్చాయని చంద్రబాబు తెలిపారు. అంటే్.. ప్రజల్ని ప్రజలే ఆదుకున్నారని తెలిపారు. 


విజయవాడ వరద బాధితుల కోసం  స్పందించిన  ప్రజలు 


విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించడంతో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. అదానీ  నుంచి సామాన్యుడు వరకూ తమ శక్తి మేర సీఎంఆర్ఎఫ్‌కు విరాళారు. అదానీ కంపెనీ అత్యధికంగా పాతిక కోట్ల రూపాయలు ఇచ్చింది. ఉద్యోగులు కూడా ఒక రోజు జీతం విరాళం ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలు స్పందించడంతో బాధితులకు వెంటనే సాయం అందింది. వరదలు తగ్గిన వెంటనే ప్రబుత్వ అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టారు. వరదలు వచ్చిన ప్రతి ఇంటికి పరిహారం అందించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందించాలన్న లక్ష్యంతో పని చేశారు. ఆ మేరకు.. నాలుగు లక్షల మంది ఖాతాల్లో సాయం జమ చేశారు.                  


జగన్‌కు దూరంగా ధర్మాన ప్రసాదరావు - కొడుకుకు రాజకీయ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చే పార్టీలోకే జంప్ !


రూ. 400 కోట్ల విరాళాలు రావడం ఓ రికార్డు                           


ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వాలకు  విరాళాలివ్వడం సహజమే. అయితే ఇలా ఒక్క  సారే వందల కోట్లు వచ్చేంత  సాయం గతంలో ఎప్పుడూ రాలేదు. పెద్ద ఎత్తున ఇప్పుడే దాతలు,  ప్రజలు స్పందించి.. ప్రజలకు అండగా నిలిచారు. ప్రభుత్వం ఇవ్వడం వేరు.. నేరుగా ప్రజలే ముందుకు వచ్చి సాయంగా నిలవడం వేరు. ఆ స్ఫూర్తి ముందు ముందుగా అందరూ కలసి కట్టుగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. అందుకే చంద్రబాబునాయుడు విరాళాల్ని ప్రోత్సహిస్తారని చెబుతారు. 


ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ - మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరికల సంకేతం అదేనా ?


పెద్ద ఎత్తున ఇతర సాయం కూడా చేసిన దాతలు


ఇలా నగదు రూపంలో ఇచ్చిన వారే కాకుండా.. వరదల సమయంలో బాధితుల కోసం .. రూ. కోట్లు ఖర్చు పెట్టిన  సంస్థలు ఉన్నాయి. ఆహారం, నీరు అందించేందుకు లక్షలు ఖర్చు పెట్టారు. దివీస్ పరిశ్రమ ఆహారం కోసం ఐదు కోట్లకు  పైగా ఖర్చు  పెట్టింది. అదనంగా విరాళంగా ఇచ్చింది.చిన్న చిన్న  స్వచ్చంద సంస్థలు కూడా విడిగా బెజవాడ వాసులకు సరుకులు సరఫరా చేశాయి. వైసీపీ అధినేత జగన్ రూ.కోటి సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని సరుకుల రూపంలో పంపిణీ చేశామని తెలిపారు. ఇలా అందరూ బాధితుల కు అండగా నిలవడంతో.. నష్టపోయినా.. ఎంతో కొంత సాయం అందడం ద్వారా.. తమకు ప్రజలు, ప్రభుత్వం అండగా ఉన్నారని..బాధితులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.