Dharmavaram factional politics : ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే ఫ్యాషన్ కు పెట్టింది పేరు. గత రెండు దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లాలోని కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ గొడవలు తారాస్థాయిలో ఉండేవి. ప్రధానంగా ధర్మవరం పెనుగొండ రాప్తాడు తాడిపత్రి నియోజకవర్గాల్లో ఈ ఫ్యాక్షన్ అధికంగా కనిపించింది. రాను రాను ఈ ఫ్యాక్షన్ కాస్త రాజకీయంగా మలుపు తిరగడం జరిగాయి. ఫ్యాక్షన్ నేతలు అందరూ కూడా వారికి నచ్చిన పార్టీలో చేరి పార్టీ జెండాను చేతపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. అయినప్పటికీ ఫ్యాషన్ మూలాలు ఉన్న నేతలు దాని నుంచి బయటపడలేక పోయారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఫ్యాక్షన్ నేతలదే ఆధిపత్యం చెలాయించేవారు. ఇలా ఫ్యాక్షన్ కత్తికి బలైన బడా నేతలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అక్కడక్కడ ఫ్యాక్షన్ కు సంబంధించి కక్షలు కార్బోణ్యాలతో రగిలిపోతూనే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు జిల్లాలోని పరిస్థితి ఏ విధంగా ఉందో. 


 ధర్మవరం సెన్సిటివ్ ఏరియా అన్న మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి


ఫ్యాక్షన్ నేపథ్యమున్న ధర్మవరం నియోజకవర్గం ప్రత్యేకమైన స్థానం ఉంది. ధర్మవరం చాలా సెన్సిటివ్ ఏరియా ఇక్కడ పనిచేయాలంటే పోలీసులకు కూడా కత్తి మీద స్వాముల ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఏ ఫ్యాక్షన్ గొడవ జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాంటి నియోజకవర్గంలో నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరుడిని సబ్ జైల్లో పలకరించేందుకు వెళ్లిన సమయంలో జైలు బయట చిన్న వివాదం చోటు చేసుకుంది. బిజెపి నేతలు,  వెంకటరామిరెడ్డి డ్రైవర్ మధ్య జరిగిన ఈ గొడవ కాస్త ఉద్రిక్త పరిస్థితులకు తీసింది. దీనిపైన స్పందించిన మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 


 మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాటలు దేనికి సంకేతం


గత ఐదు సంవత్సరాలలో ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కానీ ధర్మవరంలో జరగకుండా చూశానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతలు దెబ్బతినకుండా ధర్మవరం నియోజకవర్గంలోని ప్రజలను తన కార్యకర్తలను అనునిత్యం చూసుకున్నానని వెల్లడించారు. కానీ మా కార్యకర్తలను అలా సైలెంట్ గా ఉండమని చెప్పి నేను తప్పు చేశానని అందుకుగాను కార్యకర్తలు నన్ను క్షమించాలని కేతరెడ్డి వెంకటరామిరెడ్డి వేడుకున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు వారందరినీ నిలువరించి ఉంటే ఈ రోజు మనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ధర్మవరం నియోజకవర్గంలో కొత్త రాజకీయ పోకడలకు దారితీస్తుందని ఇది సరైనది కాదన్నారు. 2004 ముందు వరకు ఫ్యాక్షన్ గొడవలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కు మంటూ ఉండే ప్రజలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ లేకుండా చేశారని గుర్తు చేశారు. అనంతరం మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మరొకసారి ఫ్యాక్షన్ వైపు తీసుకెళ్తున్నారని వెల్లడించారు. పది రూపాయలకు కూడా మర్డర్ చేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. 


అందరి లెక్కలు సరి చేస్తానని కేతిరెడ్డి వార్నింగ్ 


లెక్కలు నాకు తెలుసు అందరి లెక్కలు నేను సరి చేస్తా అని గట్టిగా విమర్శించారు. సబ్ జైలు పోలీస్ స్టేషన్  వంద అడుగుల దూరం కూడా లేనప్పటికీ రెండు గంటల పాటు పోలీసులు కూడా అటువైపు రాలేదని విమర్శించారు. ధర్మవరం నుంచి ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టేందుకు 18 సంవత్సరాల టైం పట్టిందని మరి ప్రస్తుతం అదే విధంగా ఫ్యాక్షన్ ప్రేరేపించే విధంగా గొడవలు జరుగుతున్నాయని వీటిని సహించే ప్రసక్తే లేదని కేతరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు