Former MP Gorantla Madhav arrest :  వైఎస్ఆర్‌సీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.  వైఎస్ భారతిపై అనుచిత కేసులో అరెస్టు అయిన చేబ్రోలు కిరణ్‌ను పీఎస్‌కు తరలిస్తుండగా కారులో వెంబడించారు మాధవ్‌. గుంటూరు నుంచి మంగళగిరి వరకు వెళ్తూ వాహనాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. ఎస్పీ ఆఫీస్‌లో ఎస్కార్ట్‌పై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన తీరు తేడాగా ఉండటంతో పోలీసులు అరెస్టు చేశారు. 

Continues below advertisement


పోలీసు అధికారిగా పని చేసిన మాధవ్ 


గోరంట్ల మాధవ్ మాజీ పోలీసు అధికారి. అనంతపురం జిల్లాలో  ఆయన సీఐగా పని చేస్తున్న సమయంలో ఓ వివాదంలో ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డిపై మీసాలు మెలేసి,తొడలు కొట్టారు. పోలీసు అధికారుల సంఘం పేరుతో ఆయన చేసిన ప్రకటనలకు వైసీపీ అధినేత జగన్ మెచ్చారు. వెంటనే ఆయనకు ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఎంపీగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా పలు పనులు చేశారు. ఓ న్యూడ్ వీడియో ఉదంతంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. 


గత ఎన్నికల్లో దక్కని టిక్కెట్ 


ఈ కారణంగా గత ఎన్నికల్లో ఆయనకు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయించలేదు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదు. దాంతో సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తనకు ఏదో ఓ నియోజకవర్గానికి ఇంచార్జ్ వేయాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు జగన్. కానీ ఇంకా ఏ నియోజకవర్గానికీ ఇంచార్జ్ గా ప్రకటించలేదు. ఈ క్రమంలో తన విధేయత నిరూపించుకోవడానికి ఆయన ఐటీడీపీ కార్యకర్త పై దాడి అంశాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది.  


ఏదో ఓ నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కోసం ప్రయత్నాలు 


పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిపై దాడికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తారని గోరంట్ల మాధవ్ కు తెలియకుండా ఉండదు. అయితే వైఎస్ భారతిని కించ పరిచిన వారిపై దాడి  చేసిన వ్యక్తిగా తనకు పేరు వస్తుందని..  అరెస్టు అయినా స్టేషన్ బెయిల్ లేదా.. కొఇతర బెయిల్ తీసుకు రావొచ్చని కానీ జగన్ అభిమానాన్ని పొందవచ్చని ఆయన ప్లాన్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. స్వయంగా గోరంట్ల మాధవ్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా చంపేస్తామని ఆయన ఇటీవల హెచ్చరించారు. 


జగన్ ను మెప్పించేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారా ?                          


నోటిపై అదుదపు ఉండని నేతగా పేరున్న ఆయన ఓ సోషల్ మీడియా కార్యకర్తపై ప్రభావం చూపి.. పార్టీలో హీరో అవ్వాలనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాడులు చేయడం ప్రారంభిస్తే అంత కంటే ఘోరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై కూడా చేయాల్సి ఉంటుంది కదా అని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. గోరంట్ల మాధవ్ వ్యవహరశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది.