leave granted for Jawahar Reddy | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి సెలవు మంజూరైంది. జూన్ 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అంటే 21 రోజుల పాటు ఆర్జిత సెలవు(earned leave) మంజూరు చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టీ సంఖ్య 1058 ద్వారా ఏపీ ప్రభుత్వ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం (జూన్ 6న) ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అఖిల భారత లీవ్ రూల్స్ 1955 ప్రకారం ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ కొత్త సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు అనంతరం జవహర్ రెడ్డి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.