Fire From Borewell In Konaseema District: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బోరు నుంచి ఒక్కసారిగా మంటలు రావడం చూసి స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మలికిపురం (Malikipuram) మండలం దిండి కాసవరపు లంకలో చెరువుల వద్ద మంచినీటి బోరు వేస్తుండగా.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనిపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికంగా ఉన్న గ్యాస్ పైప్ లైన్ వల్లే మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ఓఎన్జీసీ అధికారులు సైతం అక్కడికి వచ్చి పరిశీలించారు.

Continues below advertisement


Also Read: Ap Congress Candidates: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల మరో జాబితా రిలీజ్ - 38 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచింది వీరే!