Kaluva Srinivasulu Arrest: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎన్.హనుమాపురంలో హై టెన్షన్ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి బుధవారం కణేకల్ మండలం ఎన్.హుమాపురం గ్రామంలో పర్యటించారు. అయితే పర్యటన సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై.. గత ఎమ్మెల్యే చర్యకు రావాలని సవాల్ విసిరారు. అయితే ఈ విషయం తెలుసుకొని సవాలును స్వీకరించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం ఎన్.హనుమాపురం గ్రామానికి వచ్చారు. అభివృద్ధిపై తను చర్చకు సిద్ధమని, ఎమ్మెల్యే కాపు రామ చంద్రారెడ్డి రావాలని ప్రతి సవాల్ చేశారు. వెంటనే ఆయన చర్చకు వస్తే మంచిదంటూ వెళ్లి గ్రామంలో కూర్చున్నారు. మీడియాతో మాట్లాడుతుంటగా... పోలీసులు వచ్చారు. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేషారు. ఈ క్రమంలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్పుడు టీడీపీ శ్రేణులంతా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు హనుమాపురం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 



మేం ప్రారంభించిన పనులు పూర్తి చేయలేని అసమర్థుడు ప్రస్తుత ఎమ్మెల్యే


తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు దుయ్యబట్టారు. బుధవారం ఉదయం ఆయన వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం అభివృద్ధికి ఎవరెవరు ఏం చేశారో బయట పెట్టాలని తాను చేసిన సవాల్‌ను స్వీకరించకుండా ఎమ్మెల్యే క్షమాపణలు చెబుతున్నాడని వివరించారు. మొదటి సెల్ఫీ వీడియో ఛాలెంజ్‌లో బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులు ఎందుకు అని ఎమ్మెల్యే “కాపు” సవాల్ విసిరినట్లు తెలిపారు. ఆ రోజుల్లో గోనబావి వద్ద రూ. 24 కోట్లతో నిర్మించిన ఆశ్రమ పాఠశాల భవనం నేటికీ పూర్తి కాకపోవడం నిజం కాదా అని కాలువ శ్రీనివాసులు ప్రశ్నించారు. తనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మాని పేలుళ్లు జరిపి ఆగిపోయిన ఆశ్రమ పాఠశాల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. స్వార్థంతో జేబులు నింపుకునేందుకు నాలుగేళ్ల విలువైన సమయాన్ని వెచ్చించారని విమర్శించారు.


కనీసం ఈ ఏడాదైనా భవనాన్ని పూర్తి చేసేందుకు దృష్టి సారించాలని సూచించారు. కాపు లేకపోయినా బీసీ బాలికల ఆశ్రమ పాఠశాలను పూర్తి చేయలేనని ఒప్పుకుని దీపాలు వెలిగించాల్సి వచ్చిందని వివరించారు. ప్రతి సోమవారం సెల్ఫీ ఛాలెంజ్‌తో సవాల్‌ విసురుతానని కాపు తెలిపారని.. కనీసం ఇప్పటికైనా బళ్లారిలో దోచుకోవడం, దాక్కోవడం మానేసి మిమ్మల్ని నమ్మి గెలిపించిన రాయదుర్గం ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నించండూ సూచనలు చేశారు. ఈ సందర్భంగా కాపు రామ చంద్రా రెడ్డి అవినీతి, అక్రమాలను ప్రజల్లో ఎండగడతామని కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలువ ఈరోజు.. హనుమాపురంలో అభివృద్ధి పనులపై చర్చకు వెళ్లగా పోలీసులు వచ్చి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.