MLA Peddireddy: వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యేలు  ఎగతాళి చేసే పరిస్థితి శుక్రవారం ఏర్పడింది. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ సభ్యుడి పదవికి మాజీ మంత్రి పెద్దిరెడ్డితో వైసీపీ అధినేత జగన్ నామినేషన్ వేయించారు. తీరా ఓటింగ్ సమయానికి ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు. బెంగళూరు వెళ్లిపోయారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడంతో ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వైసీపీ అసలు చేస్తుందో ఆ పార్టీ నేతలకైనా అర్థమవుతుందా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. 


పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన బలం లేని వైసీపీ 


పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి సాధారణంగా విపక్షాలకే ఇస్తారు. అయితే పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంత బలం వైసీపీకి లేకనే జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇప్పుడు పీఏసీ సభ్యుడికి ఆ బలం వచ్చే అవకాశం లేదు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అందుకే  బలం ప్రకారం వెళ్లాలని నిర్ణయించారు. కానీ పీఏసీ చైర్మన్ పదవి కూడా తమకే ఇవ్వాలని వైసీపీ వాదించింది. అలా ఇవ్వాలంటే ముందుగా పీఏసీ సభ్యుడిగా గెలవాలని ఎన్నికలు పెట్టింది. జగన్ తమ పార్టీ తరపున పెద్దిరెడ్డిని పోటీకి పెట్టారు. 


Also Read:  షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్


అయినా పెద్దిరెడ్డిని పోటీ పెట్టిన జగన్ 


పెద్దిరెడ్డికి పోటీకి పెట్టడం వెనుక తమకు చాలా పెద్ద వ్యూహం ఉందని వైసీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఆ వ్యూహం ఏమిటంటే కూటమి సభ్యులకు ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు సభకు రావడంకష్టమని వాారిలో కొంత మందికి అత్యవసర పనులు ఉంటాని వారు రారని అంచనా వేశారు. ఇలా పది మంది రాకపోతే సరిపోతుందని పెద్దిరెడ్డి పీఏసీ సభ్యుడిగా ఎన్నికవుతారని తర్వాత తప్పనిసరిగా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని అనుకున్నారు. 


Also Read:  ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్


చివరికి జగన్ కూడా ఓటింగ్ కు రాని వైనం ! 


అయితే పీఏసీలో ఓటింగ్ ప్రారంభం కాక ముందే తాము బాయ్ కాట్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. దీనికి కారణం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడం. స్వయంగా పార్టీ అధినేత జగన్ ఓటింగ్ కు రాకుండా అంసెబ్లీ  ప్రారంభమయ్యే సమయానికి బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. తమ పార్టీకి  ఉన్న ఓట్లు కూడా పెద్దిరెడ్డికి రాకపోతే పరువు పోతుందన్న ఉద్దేశంతో బాయ్ కాట్ చేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ మాత్రం ఆలోచన లేని రాజకీయం చేయడం వల్ల పెద్దిరెడ్డి వంటి నేత అవమానానికి గురయ్యారని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.