ఇనాక్టివ్ రాజకీయ పార్టీలుగా గుర్తించిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తి దళ్ పార్టీ, ఆలిండియా ముత్తహిదా ఖ్వామీ మహజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, మన పార్టీ, నేషనలిస్టిక్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజా భారత్ పార్టీ, ప్రజాపార్టీ, ప్రజాశాంతి పార్టీ, సురాజ్ పార్టీ ఉన్నాయి. 


ఇనాక్టివ్ పార్టీగా ఉన్న పార్టీల్లో కేఏ పాల్ అధ్యక్షత వహించే ప్రజాశాంతి పార్టీ ఉంది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో అచేతనంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం గుర్తించింది. దిల్లీ, బిహార్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 253 పార్టీలు ఇనాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించింది ఎన్నికల సంఘం. 


కేంద్ర ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు ఆయా పార్టీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవంతో వాటిని ఇన్‌యాక్టివ్‌ జాబితాలో ఉంచారు. 


2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను సైతం ఆ జాబితాలో ఉంచింది. కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఎన్నికల చట్టాల నిబంధనలను అమలు చేయకుండా వ్యవహరిస్తున్న పార్టీలను కూడా ఇందులో ఉంచింది.