Cow Birthday : పెంపుడు జంతువులపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమ చూపిస్తుంటారు. కొందరు బర్త్ డే చేస్తుంటారు. మరికొందరు శ్రీమంతం చేస్తుంటారు. గతంలో కోడి, శునకానికి పుట్టిన రోజులు చేసిన ఘటనలు చేశారు. అయితే కోనసీమ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో ఆవు దూడకు పుట్టినరోజు వేడుకలు చేశారు. మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మేడిచర్ల మౌలీనాయుడు తన ఆవుదూడ రెండో ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఆవు దూడ ముందు కేకు కట్ చేయించి తన ప్రేమను చాటుకున్నారు.  



గతంలోనూ ఇలాంటి ఘటనలు 


ఆత్మీయుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ కొందరు తాము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాలు, ఆవుల జన్మదిన వేడుకలు సైతం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వాటిపై అభిమానాన్ని చాటుకుంటారు. ఇటీవల అనంతపురం జిల్లాకు రైతు చండ్రాయప్ప తన ఆవుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గోరంట్ల మండలం మందలపల్లిలో చండ్రాయప్ప ఇంట్లో నాలుగేళ్ల ఆవు ఉంది. దానికి ఆయన లక్ష్మీ అనే పేరు పెట్టుకున్నారు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆవును కూడా తన కూతురులాగే చూసుకుంటున్నానని చెప్పారు. ఆ కుటుంబంతో లక్ష్మీ ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.  


Also Read : YSRCP Dissidence : జగన్ దృష్టి పెట్టారు - అందరూ సర్దుకున్నారు ! వైఎస్ఆర్‌సీపీలో తేలిపోయిన అసంతృప్తి


జన్మదిన వేడుకలు ఘనంగా 


చండ్రాయప్ప కుటుంబ సభ్యులు లక్ష్మీని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఏటా ఆవు జన్మదిన వేడుకలను ఘనంగా చేస్తారు. అదేవిధంగా గత ఏడాది నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చుట్టుపక్కల వారిని పిలిచి లక్ష్మీ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. లక్ష్మీని అందంగా ముస్తాబు చేసి పూజలు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. రైతు చండ్రాయప్ప మాట్లాడుతూ ఆవును తమ ఇంటి మాలక్ష్మిగా భావిస్తామన్నారు. తన కూతుళ్లతో సమానంగా లక్ష్మీ పెంచుకుంటున్నామని చెప్పాడు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇలా చేయడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. రైతులు మూగజీవాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారనడానికి ఈ ఘటననే నిదర్శనం. 


Also Read : Pawan Kalyan : లక్ష ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్లిపోను - కౌలు రైతుల బిడ్డల కోసం ప్రత్యేక నిధి : పవన్ కల్యాణ్