ఒకటి, రెండు కాదు ఏకంగా 25 పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. చలానా లిస్ట్ తీస్తే చాంతాడంత రావడంతో వెంటనే కట్టాలని పోలీసులు ఆదేశించారు. దీంతో పెండింగ్ ఉన్న ఐదు వేల రూపాయలు కట్టి బండిని విడిపించుకున్నాడు వాహనదారుడు. ట్రాఫిక్ సార్జంట్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనదారుడి బైక్ ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా ఒకటి రెండు కాదు ఏకంగా 25 పెండింగ్ చలానాలు ఉండటాన్ని ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ గుర్తించారు. 


Also Read: కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..


15 అడుగుల పొడవుతో చలానాల లిస్ట్


ఈ పెండింగ్ చలానాలకు ట్రాఫిక్ పోలీసులు ప్రింట్ కొట్టగానే రసీదుల మిషన్ నుంచి 15 అడుగుల పొడవుతో చలానాల లిస్ట్ వచ్చింది. ఇంత పెద్ద లిస్టు ఆగకుండా రావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆశ్చర్యపోయారు. వాహనదారుడి నుంచి పెండింగ్ చలానాల ఫైన్ రూ. 5 వేలు వసూలు చేసి ఇంటికి పంపారు. ఇన్ని చలానాలు చెల్లించుకుండా ఎలా తప్పించుకున్నాడని స్థానికులు ఒకింత ఆశ్చర్యపోయారు. నాలుగైదు చలానాలకే పోలీసులు వాహనాలు సీజ్ చేస్తారు. కానీ పోలీసులు కళ్లుగప్పి 25 చలానాలు కట్టకుండా తిరుగుతున్నాడు వాహనదారుడు. దీంతో అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 


Also Read:  ఏపీలో పెరిగిన క్రైమ్ రేట్... గంజాయి రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు... క్రైమ్ వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ


వాహనదారుడికి కౌన్సిలింగ్


ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన, భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా పోలీసులు వివిధ జరిమానాల రూపంలో 25 చలానాలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారుడు చలానాలు కట్టకుండా తిరుగుతున్నట్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన, చలానాలు చెల్లింపులో తాత్సార్యంపై అవగాహన కల్పించి పేటీఎం యాప్ ద్వారా ద్విచక్ర వాహనదారుడి నుంచి సుమారు రూ. 5 వేలు పెండింగ్ చలనా సొమ్ము రికవరీ చేశారు. పెండింగ్ చలానాలు ఉంటే చర్యలు తప్పవని ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు పెండింగ్ చలానాల రికవరీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  


Aslo Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి