ఆంధ్రప్రదేశ్  క్రైమ్ వార్షిక నివేదికను డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం వెల్లడించారు. స్పందన అర్జీల పరిష్కారానికి నిర్ణీత సమయానికి కేటాయించామని డీజీపీ తెలిపారు. దిశ యాప్ ద్వారా మహిళల భద్రత మరింత పెరిగిందన్నారు. ఏడు వేలకు పైనా ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశామన్నారు. గంజాయి పెంపకాన్ని మావోయిస్టులు వివిధ కారణాలతో ప్రోత్సహిస్తున్నారని డీజీపీ తెలిపారు. అయినా గంజాయి పెంపకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 శాతం సీసీ టీవీల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని డీజీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్లు, లాకప్ లలో సీసీ టీవీలు పెడతున్నామన్నారు. పోలీస్ వ్యవస్థకు సాంకేతికతను జోడించడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 


తగ్గిన సైబర్ క్రైమ్ రేట్


పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్, డిజిటలీకరణ చర్యలు చెప్పటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై అత్యాచారం, వేధింపులు, ర్యాగింగ్ కేసులు పెరిగాయని డీజీపీ తెలిపారు.  ఇసుక, మద్యం అక్రమ రవాణా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయన్నారు. సైబర్ క్రైమ్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గిందన్నారు. క్రైమ్ రేటు 3% పెరిగిందన్నారు. నమోదైన కేసుల్లో 75.09% పరిష్కారమయ్యాయని తెలిపారు. లైంగిక దాడుల వంటి నేరాలను త్వరితగతిన పరిష్కరించామని డీజీపీ తెలిపారు. 75 అత్యాచారం, 1061 లైంగిక దాడుల నేరాలలో 7 రోజుల్లో ఛార్జిషీటు వేశామన్నారు. 97.42 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 34,037 మంది పిల్లలకు భద్రత కల్పించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 


Aslo Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !


గంజాయి రవాణాపై ఉక్కుపాదం


రాష్ట్రంలో 1,63,033 స్పందన పిటిషన్లలో 40,404 కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని డీజీపీ తెలిపారు. ఆపరేషన్ పరివర్తనలో 7226 ఎకరాల గంజాయి ధ్వంసం చేశామన్నారు. గంజాయి రవాణాకు కేసుల్లో 3,14,514.4 కేజీల గంజాయి, 1,694 వాహనాలు సీజ్ చేసి, 6792 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. 2762 గంజాయి కేసులు నమోదు చేశామని ప్రకటించారు. మావో ప్రభావిత ప్రాంతాలలో కూడా గంజాయి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. మద్యం అక్రమ రవాణాలో 43293 లిక్కర్ కేసులు పెట్టామని, 60868 మందిని అరెస్టు చేశామన్నారు. లిక్కర్ కేసులలో 20945 వాహనాలు సీజ్ చేశామన్నారు. 


Aslo Read: ప్రజల వద్దకే నేరుగా పథకాలు.. సీఎం జగన్ వెల్లడి, తాజాగా వారి అకౌంట్లలోకి 703 కోట్లు


స్మార్ట్ పోలీసింగ్ లో నెంబర్ వన్


ప్రతీ పోలీసు స్టేషన్లో 100 ఎంబీపీఎస్ వరకూ నెట్ కనెక్టివిటీ ఇస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీ పోలీసు డేటా సెంటర్ ను టియర్-3కు పెంచామని గుర్తుచేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, గుజరాత్ తో ఎంఓయూ చేసుకున్నామన్నారు. 50 సైబర్ సేఫ్ కియోస్క్ లు రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్న డీజీపీ...స్మార్ట్ పోలీసింగ్ లో ప్రథమ స్థానం సాధించామన్నారు. రాష్ట్ర పోలీసు శాఖకు 150 జాతీయ అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. 


Aslo Read: హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి