Additional Coaches To Some Trains: ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిమాండ్, రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు స్లీపర్, ఏసీ కోచ్‌లను పెంచింది. మొత్తం 4 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. విశాఖ నుంచి బయలుదేరే విశాఖ - అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 20807) రైలుకు అదనంగా స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన అమల్లోకి రానుందని చెప్పారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఈ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే అమృత్ సర్ - విశాఖ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) రైలుకు అదనంగా స్లీపర్ క్లాస్, మరో 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన.. సెప్టెంబర్ 7 నుంచి అమల్లోకి రానుంది.



  • అలాగే, విశాఖ నుంచి బయలుదేరే విశాఖ - నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20811) రైలుకు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తాయి. అటు, నాందేడ్ - విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20812) రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

  • పెంచిన కోచ్‌లతో ఈ సూపర్ ఫాస్ట్ రైలుకు సెకండ్ ఏసీ - 1, థర్డ్ ఏసీ - 4, స్లీపర్ - 7, జనరల్ సెకండ్ క్లాస్ - 4, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగన్ కోచ్ - 1 ఉంటాయని అధికారులు తెలిపారు.

  • అటు, భారీ వర్షాలతో పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్‌లో బజావా - రానోలి మధ్య వంతెన వద్ద నీరు నిలిచిపోవడంతో పూరీ - గాంధీధామ్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22974) రైలును ఈ నెల 31న రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు తెలిపారు.


Also Read: Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద - 18 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల