Kona venkat CHiru Fans :   సినీ రచయిత కోన వెంకట్ బాపట్లలో చిరంజీవి అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కోన వెంకట్ స్వస్థలం బాపట్ల. ఆయన సమీప బంధువు కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సందర్భంగా బాపట్ల వచ్చిన ఆయన చిరంజీవి అభిమానులతో  ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.  చిరంజీవి అభిమానులు కోన వెంకట్‌ను ఘనంగా సత్కరించారు. 


చిరంజీవి అభిమానులతో ప్రత్యేకంగా ఫ్యాన్ మీట్ నిర్వహించిన కోన వెంకట్ 


కోన వెంకట్ నిర్వహించిన ఫ్యాన్స్ మీటింగ్‌లో  చిరు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంత వరకు బాపట్లలో ఏ సినిమా హీరో అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయలేదని .. మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి కథ స్క్రీన్ ప్లే సమకూర్చిన కోన వెంకట్ చిరంజీవి అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయడం సంతోషమని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.  .మెగాస్టార్ చిరంజీవిని ఏ విధంగా అయితే మన ఊహించుకుని ఇష్టపడ్డామో, ఎలాంటి చిత్రాలను చూసి అయితే మనం అభిమానులుగా మారామో వాటిని మించి వాల్తేరు వీరయ్య చిత్రం అలా ఉంటుందని హామీ ఇచ్చారు.    


చిరంజీవితో ఫోటో సెషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ 


మెగాస్టార్ చిరంజీవితో బాపట్ల నుంచి అభిమానులను ఫోటో సెషన్ ఏర్పాటు చేయాలని అభిమానులు కోరారు.  బాపట్ల నుంచి ఒక 50 మంది అభిమానులను మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి అభిమానులకు ఫోటో సెషన్ ఏర్పాటు చేయిస్తానని కోన వెంకట్ హామి ఇచ్చారు. అయితే కోన వెంకట్ చిరంజీవి ఫ్యాన్స్ ను దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయన భేటీ వెనుక రాజకీయం కూడా ఉందన్న చర్చ జోరుగా నడుస్తోంది. కోన ఫ్యామిలీ వైసీపీలో ఉంది. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ .. వైసీపీకి మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు పెరిగాయి. పవన్, చిరంజీవిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న కామెంట్లుతో వారి అభిమానులంతా వైసీపీకి దూరమయ్యారు. 


బాపట్లలో మెగా ఫ్యాన్స్  వైసీపీ మద్దతుగా ఉండేలా చూసుకుంటున్నారా ?


అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. బాపట్లలో బలంగా ఉన్న .. ఓ సామాజికవర్గం పూర్తిగా వైసీపీకి దూరమవుతుందని అదే జరిగితే.. తన సోదరుడు రాజకీయ ఎదుగదలకు అడ్డంకి అవుతుందని కోన వెంకట్ భావిస్తున్నారని అందుకే..  ముందుగా మెగాస్టార్ అభిమానుల్ని దువ్వుతున్నారని చెబుతున్నారు. లేకపోతే సినిమా సాకుతో బాపట్లలోనే ఎందుకు సమావేశం పెట్టారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. కోన వెంకట్ కూడా రాజకీయంగా చురుకుగా ఉంటారు. వైసీపీ కోసం ఆయన తరచూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతూనే ఉంటారు. 


ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలోకి, ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు