చంద్రబాబు హయాం కన్నా మెరుగ్గా శ్రీకాకుళంలో పరిపాలనా ఫలాలు ప్రజలకు అందుతున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. చంద్రబాబు పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.  మూడేళ్ల తర్వాత చంద్రబాబు శ్రీకాకుళం వచ్చారని..   నాటి బాబు పాలన‌కంటే అనెక రెట్లు మెరుగ్గా వైఎస్ఆర్‌సీపీ పరిపాలన అందిస్తోందన్నారు. అవినీతి రహితంగా పాలన అందిస్తున్నాం... ప్రజల జీవనప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టామని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశఆరు.  కరోనాను ఈ ప్రభుత్వం ఎంత సమర్థంగా ఎదుర్కొందో ప్రజలు గమనించారన్నారు.  మందులు , డాక్టర్ లేరని ఒక్క పౌరుడు కష్టకాలంలొ బాధపడలేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం కోవిడ్ మెకానిజం చేయగలిగిందన్నారు. 


వైద్య ఆరోగ్యశాఖలో ఎలాంటి తప్పులు క్షమించం, ఉదయగిరి ఘటనపై స్పందించిన మంత్రి విడదల రజిని


ఆస్పత్రుల్లో గతంలో  ఒక్క మార్పు కూడా జరగలేదని.. కానీ ఇప్పుడు ఆస్పత్రులకు వెళ్లి చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటుకి ధీటుగా పని చేస్తున్నాయన్నారు. చెత్తకు పన్ను వేశామని విమర్శలు చేస్తున్నారని.. దేశంలో వచ్చిన సంస్కరణలను స్వాగతించాలన్నారు. గతంలో చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయలేకపోయారని.. ఇప్పుడు ఇంటింటికి వచ్చి చెత్త తీసుకెళ్తున్నారన్నారు.   లబ్దిదారుల అర్హత ప్రామానికంగా సంక్షేమం అందిస్తున్నామని..  అవినితి లేకుండా అందరికీ లబ్ది చేకూరుతోందని గుర్తు చేశారు. నాడు జన్మభూమి కమిటీలు ఏం చేశాయో గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని ధర్మాన వ్యాఖ్యానించారు. 


కరెంట్ కోతల విషయంలో చంద్రబాబు చేసిన విమర్శలను కూడా ఖండించారు. తాము వచ్చాక కరెంట్ ఉత్పత్తి తగ్గించామా అని ప్రశ్నించారు.  కరెంట్ కోత సమస్యకు చంద్రబాబుది కూడా  బాధ్యత ఉందన్నారు.  ఇంటి అవసరాలు , జీవనప్రమాణాలు పెరిగాయని అందుకే కరెంట్ డిమాండ్ పెరిగిందన్నారు. టీడీపీ నేతలు  బాదుడే బాదుడు అంటున్నారని..  నిత్యావసర వస్తువల ధరలు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా తక్కువ ఉన్నాయా అని ప్రశఅనించారు. ఏపీ‌ కంటే సామాన్యుల వైపు నిలబడిన ఇంకో రాష్ర్టం ఉందా..? అని ధర్మాన ప్రశ్నించారు.  


ఆ మహిళలు, యువతులపై రేప్‌లు చేసింది వాళ్లే, ఆ మీడియా దాచిపెడుతోంది: సీఎం జగన్ వ్యాఖ్యలు


శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ ఏమీ చేయలేదన్నారు.   ఉద్దానంకు నీరిచ్చారా... కిడ్ని సమష్యకు పరిష్కారం చూపారా .. హాస్పటిల్ కట్టారా..? అని ప్రశ్నించారు. తాము  హాస్పటిల్ పూర్తి చేశామన్నారు.  ఉద్దానం సాగునీటి ప్రోజెక్ట్ దాదాపు పూర్తి అయిందన్నారు. ప్రభుత్వ అప్పులు పాలైందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది ఏదైనా. ప్రభుత్వమే కథ తీర్చ వలసిందని ధర్మాన సమర్థించారు.