DGP Dwaraka TirumalaRao Met With CM Chandrababu: సీఎం చంద్రబాబుతో (Chandrababu) డీజీపీ ద్వారకా తిరుమలరావు (Dwaraka TirumalaRao) భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎంతో సమావేశమైన పోలీస్ బాస్.. బాపట్ల (Bapatla) జిల్లా ఈపురుపాలెంలో యువతి హత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని సీఎం డీజీపీతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని నిర్దేశించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీస్ శాఖలో ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మరిన్ని బదిలీలు జరగొచ్చని సమాచారం. అటు, కీలక శాఖల్లో పలువురు ఐఏఎస్‌లు సైతం బదిలీ అయ్యారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో డీజీపీ భేటీ - బాపట్ల ఘటనపై వివరణ, పోలీస్ బాస్‌కు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
Ganesh Guptha
Updated at:
21 Jun 2024 06:53 PM (IST)
Andhrapradesh News: సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు సచివాలయంలో భేటీ అయ్యారు. బాపట్ల ఘటనపై వివరణ ఇవ్వగా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
సీఎం చంద్రబాబుతో డీజీపీ భేటీ (Image Source: Twitter)