IPS PV Sunil Vs Deputy Speaker: సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్..కులాలపై చేసిన  వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి.  ఓ కార్యక్రమంలో మాట్లాడిన పీవీ సునీల్.. కాపులు, దళితులు కలిస్తే అధికారం వస్తందని కాపులకు ముఖ్యమంత్రి పదవి, దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలన్నారు.  మనం అందరిని కలుపుకొనిపోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేయాలని..  దళితవాడ పంచాయతీకి మద్దతు ఇవ్వాలన్నారు. గతంలో తనకు టిక్కెట్ ఇస్తామన్నారని కానీ తనకు వద్దని దళితవాడ పంచాయతీలు కావాలని కోరానన్నారు. అందుకే  మిగతా కులాలని కూడా కలుపుకోవాలన్నారు. మా నిధులు మాకు ఇవ్వండి మా పంచాయతీ మాకు ఇవ్వండి  అని డిమాండ్ చేస్తున్న సునీల్ కుమార్ వీడియో వైరల్ అయింది.   

Continues below advertisement






ఈ వీడియోపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు.  ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందని.. కుల మతాల గురించి గాని ..  ముఖ్యంగా రాజకీయాల గురించి కానీ మాట్లాడకూడదన్నారు. ఒక రాజకీయ నాయకుడులాగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉండకూడదన్నట్లుగా మాట్లాడటం  ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలన్నారు.లేకపోతే  అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పెట్టుకొని ఉపయోగం ఉండదన్నారు. 


సునీల్ కుమార్ రావాలనుకుంటే రిజైన్ చేసి పబ్లిక్ లైఫ్ లోకి రావచ్చు పోటీ చేసుకోవచ్చు సర్వీస్ లో ఉండి మరి  నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి  లేదని స్పష్టం చేశారు.  డిఓపిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు ఈ వీడియోతో సహా జత చేసి ఫిర్యాదు చేసినట్లుగా రఘురామ తెలిపారు. గతంలోనూ కొన్ని సర్వీస్ రూల్స్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశానని.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత  కూడా చర్యలు తీసుకోలేదన్నారు. పీవీ సునీల్ కుమార్ రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి వచ్చి  ఆయన కోరుకున్న సామ్రాజ్యం స్థాపించుకునే ప్రయత్నించాలన్నారు. ఈ సారి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని.. రఘురామ కోరుతున్నారు.   



పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు.. రఘురామపై కస్టోడీయల్ టార్చర్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై కేసు నమోదు అయింది. ఈ నెల నాలుగో తేదీన పీవీ సునీల్ సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది.  గతంలోనూ ఆయన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.