Anakapalle Dalits protest against Jagan: జగన్ నర్సీపట్నం పర్యటనలో దళిత సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. కోవిడ్ సమయంలో మాస్క్, పీపీఈ కిట్ అడిగినందుకు అవమానితులై మరణించిన దళిత వైద్యుడు డా. సుధాకర్ కుటుంబానికి జగన్ ప్రజ్వలంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నర్సీపట్నంలో డా. సుధాకర్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ నర్సీపట్నం పర్యటనను నిరసిస్తూ "గోబ్యాక్ జగన్" నినాదాలతో దళిత సంఘాలు భారీ మానవ హారం నిర్వహించాయి. జగన్ హయాంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని అన్యాయంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జగన్ అనకాపల్లికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్గంలో చాలా చోట్ల జగన్ గో బ్యాక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్షమాపణ చెప్పకపోతే అడ్డుకుంటామని ప్రకటించారు.
దళిత సంఘాల ఆందోళనతో పోలీసులు జగన్ పర్యటనలో భద్రత పెంచారు. డా. సుధాకర్, దళిత వర్గానికి చెందిన వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో (2020-2024) కోవిడ్ మహమ్మారి సమయంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీలో పనిచేశారు. . పీపీఈ కిట్, మాస్క్‌లు ఇవ్వలేదని ఓ సమావేశంలో ప్రశ్నించడంతో ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. ఓ సందర్భంలో ఆయనను రోడ్డు మీద బట్టలు విప్పతీసి.. చేతులు విరిచికట్టి .. పిచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు పిచ్చి పట్టిందని వాదించారు. ఈ అంశంపై హైకోర్టు సీబీఐ విచారణకు కూడా ఆదేశించిది. "ఒక వైద్యుడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్లు, మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పి ఎవరిని మోసం చేస్తారు?" అంటూ దళిత నేతలు ప్రశ్నించారు.