7 Seater Affordable Family Diesel SUVs: మన దేశంలోని పెద్ద కుటుంబాలకు 7-సీట్ల SUVలు ఎప్పుడూ ఫస్ట్ ఛాయిస్. మొత్తం కుటుంబం కలిసి ప్రయాణించాలనుకున్నప్పుడు సౌకర్యవంతమైన, సురక్షితమైన & బడ్జెట్ రేటులో వచ్చే వాహనం అవసరం. కఠినమైన భద్రతా నిబంధనల కారణంగా కొన్ని పాత మోడళ్లను నిలిపివేసినప్పటికీ, ₹15 లక్షల లోపులో, అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే కొన్ని 7-సీటర్ డీజిల్ SUVలు ఇప్పటికీ మార్కెట్లో ఉన్నాయి.
Mahindra Bolero & Bolero Neoమహీంద్రా బొలెరో చాలా కాలంగా విశ్వసనీయతకు చిహ్నంగా ఉంది. దీని దృఢత్వం & తక్కువ నిర్వహణ కారణంగా గ్రామీణ & పట్టణ ప్రాంతాలలో ప్రజాదరణ పొందింది. బొలెరో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ శక్తిమంతమైనది & ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ఈ సిరీస్‌లో, బొలెరో అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన బొలెరో నియో కూడా ఉంది. నియోలో.. స్టైలిష్ లుక్స్ & మరింత సౌకర్యవంతమైన క్యాబిన్ ఉంటుంది. మీరు బలమైన & నమ్మదగిన SUV కోసం చూస్తున్నట్లయితే, బొలెరో సిరీస్ ఒక అద్భుతమైన ఎంపిక.
Mahindra Scorpio Classicబెస్ట్ పెర్ఫార్మెన్స్ & రగ్‌డ్ డిజైన్‌కు ప్రాధాన్యతనిచ్చే వారికి మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఒక మంచి ఎంపిక. ఇది 130 hp ని జనరేట్ చేసే 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. దీని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. మీరు స్కార్పియో అభిమాని అయితే & ఎలాంటి భూభాగంపై అయినా నడవగలిగే నమ్మకమైన SUVని కోరుకుంటే, ఈ మోడల్ మీకు సరైనది.
Mahindra Scorpio-Nమహీంద్రా స్కార్పియో-ఎన్ అనేది స్కార్పియోకు కొత్త & మరింత అధునిక వెర్షన్. 132 & 175 hp మధ్య పవర్ ఉత్పత్తి చేసే 2.2-లీటర్ mHawk Gen2 డీజిల్ ఇంజిన్‌తో ఇది బలంగా నడుస్తుంది. 4x2 & 4x4 డ్రైవ్ ఎంపికలతో, ఈ SUV నగరం & పర్వత ప్రాంతాలు రెండింటిలోనూ అద్భుతమైన హ్యాండ్లింగ్ అందిస్తుంది. దీని లుక్స్, ఫీచర్లు & సౌకర్యం Scorpio Classic కంటే మరింత ప్రీమియంగా అనిపిస్తాయి.
Mahindra XUV700మహీంద్రా XUV700 లోని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 185 hp వరకు ఇస్తుంది, రోడ్డును దడదడలాడిస్తుంది. దీనిలోని ఫీచర్లను బట్టి ఈ వెహికల్‌ను లగ్జరీ SUV తో పోల్చవచ్చు. ADAS భద్రతా వ్యవస్థ, పనోరమిక్ సన్‌రూఫ్ & డ్యూయల్-స్క్రీన్ సెటప్ వంటి హై-టెక్ ఫీచర్లను ఇది అందిస్తుంది. సాంకేతికత, భద్రత & సౌకర్యం పరిపూర్ణ కలయికను కోరుకునే వారి కోసం ఈ SUV ఒక మంచి ఆఫర్.
Tata Safari టాటా సఫారీ శక్తిమంతమైన క్రియోటెక్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 170 PS పవర్ అందిస్తుంది. దీని ప్రీమియం ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్ & మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు పెద్ద కుటుంబాల ప్రయాణాలకు చక్కగా సరిపోతాయి. మూడో సీటువరుస మంచి స్థలాన్ని & సౌకర్యాన్ని కూడా అందిస్తుంది, దీనివల్ల దూర ప్రయాణాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ బడ్జెట్ రూ. 15 లక్షల వరకు ఉంచి, మంచి 7-సీట్ల డీజిల్ SUV కోసం చూస్తున్నట్లయితే, ఈ ఐదు మోడళ్లలో ఒకదానిని మీరు ఎంచుకోవచ్చు. బలం & విశ్వసనీయత పరంగా బొలెరో & బొలెరో నియో ఉత్తమ ఎంపికలు; శక్తి & సాంకేతికత పరంగా స్కార్పియో-N & XUV700 బెటర్; స్టైల్ & సౌకర్యం పరంగా టాటా సఫారీ మంచిది.