Skoda Kushaq 50,000 km review 2025: ఒక డ్రైవింగ్‌ లవర్‌, మూడున్నర సంవత్సరాల క్రితం Skoda Kushaq 1.5L హ్యాచ్‌బ్యాక్ కొన్నారు. ఈ మూడున్నర సంవత్సరాల్లో అతను ఆ కారులో 50,000 km తిరిగారు. దాదాపు అన్ని వాతావరణ పరిస్థితులు, అన్ని రకాల రోడ్లపై ఈ కారును నడిపి చూశారు. ఈ మూడున్నరేళ్ల 50,000 km ప్రయాణంలో స్కోడా కుషాక్‌ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను రివ్యూ రూపంలో అతను రాశాడు. ఈ కారులో తనకు నచ్చిన & నచ్చని లక్షణాలను (Skoda Kushaq pros & cons) సవివరంగా వివరించాడు. ఈ రివ్యూని, ఆ డ్రైవింగ్‌ లవర్‌ మాటల్లోనే తెలుసుకుందాం.

స్కోడా కుషాక్‌ -  మూడున్నరేళ్లలో 50,000 km డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌

"మూడున్నర సంవత్సరాల్లో 50,000 కి.మీ. నడిచిన నా స్కోడా కుషాక్ 1.5L అనుభవం చాలా ఎంజాయ్‌ఫుల్‌గా ఉంది. డ్రైవింగ్‌ ఇష్టపడే వారికి నిజంగా ఈ కారును సిఫార్సు చేస్తాను. మొదట నుంచి ఈ కారు స్ట్రాంగ్‌ బిల్డ్‌ క్వాలిటీ చూపింది. సైలెంట్‌ కాబట్టి ఎటువంటి రాటిల్స్‌, స్క్వీక్స్‌ లేవు. TSI + DSG కాంబోని డ్రైవ్‌ చేస్తుంటే ఆ ఎంజాయ్‌మెంట్‌ మరో లెవెల్‌లో ఉంది. ఈ కారు సిటీలో లీటరుకు సుమారు 10 km మైలేజ్‌, హైవేస్‌లో లీటరుకు సుమారు 17 km (XP95) మైలేజ్‌ ఇచ్చింది. మ్యూజిక్ సిస్టమ్‌ సౌండ్ కూడా మంచి క్లారిటీతో చాలా అద్భుతంగా వినిపిస్తుంది. AC పనితీరు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ, పెద్ద సమస్య లేదనే చెప్పాలి.

స్కోడా కుషాక్ 1.5L లో కొన్ని విషయాలు స్టికీగా ఉన్నాయి. సస్పెన్షన్‌ కాస్త స్టిఫ్‌గా ఉంది, దీని వల్ల రోడ్డు బంప్స్‌ను ఎక్కువగా ఫీలవుతాము. డ్రైవర్‌ సైడ్ పవర్ విండో కొన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ తరువాత కూడా ఇబ్బంది పెడుతోంది. ఇంటీరియర్స్‌ విషయానికి వస్తే... నా పాత Vento TSI తో పోలిస్తే, స్కోడా కుషాక్ 1.5L  పెద్దగా ఫైన్‌ ఫీల్‌ ఇవ్వట్లేదు. వెంటిలేటెడ్ సీట్స్‌ పని చేస్తున్నప్పటికీ కొంచెం నాయిస్‌ ఉంది. నేను ఈ కారు కొన్న తర్వాత వచ్చిన పవర్డ్‌ సీట్స్ లాంటి ఫీచర్స్‌ నా కారులో లేవు, వాటిని నేను మిస్‌ అయ్యాను.

చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ, ఈ కారు డ్రైవింగ్‌ ఎంజాయ్‌మెంట్‌ ఇస్తూ ప్రతి సారి చిరునవ్వు తెప్పిస్తుంది. ప్రతిరోజూ డ్రైవ్‌ అనుభవం ఇలాంటి కార్లలోనే నిజంగా మజాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిక్స్‌డ్‌ గుడ్‌ & నాట్‌ సో గుడ్‌ ఫీచర్స్‌ ఉన్నా, ఈ ప్రొడక్ట్‌ నమ్మకంగా పని చేస్తోందని అనిపిస్తుంది. ఈ కారు డిజైన్‌, హ్యాచ్‌బ్యాక్‌ పరిమాణం, సౌకర్యం, ఫీచర్స్‌ & మైలేజ్‌ను బట్టి యువత, డైలీ డ్రైవర్స్‌ అందరూ ఆస్వాదించగలిగే స్థాయిలో ఉంది.

తుది మాట చెప్పాలంటే, స్కోడా కుషాక్ 1.5L హ్యాచ్‌బ్యాక్‌ 3.5 సంవత్సరాల్లో 50,000 km అనుభవం నాకు పూర్తిగా సంతృప్తికరంగా ఉంది. డైలీ డ్రైవ్‌, లాంగ్ డ్రైవ్‌, సిటీ మైలేజ్‌, మ్యూజిక్ & AC పనితీరు అన్నీ సరిగా ఉన్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నా, వాటిని గమనించి డ్రైవ్ చేస్తే ప్రతి రైడ్‌ నిజంగా ఫన్‌ఫుల్‌గా ఉంటుంది". 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు

హైదరాబాద్‌ & విజయవాడ సహా తెలుగు నగరాల్లో స్కోడా కుషాక్‌ బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 10.61 లక్షలు (Skoda Kushaq ex-showroom price, Hyderabad Vijayawada). ఈ కారు కొనేవాళ్లు రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 2 లక్షలు, బీమా కోసం దాదాపు రూ. 46,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించాలి. ఫైనల్‌గా, స్కోడా కుషాక్‌ దాదాపు రూ. 13.18 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు (Skoda Kushaq on-road price, Hyderabad Vijayawada) వస్తుంది.